Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ చాలా రొమాంటిక్… ఒక్కొక్కరికి ఒక్కో లవర్!

వరుసగా అందరూ తమ లవ్ స్టోరీలు చెప్పారు. తర్వాత బిగ్ బాస్ అమర్ ని చెప్పమని అడిగాడు. దీంతో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు అమర్. తర్వాత తన భార్య తేజు గురించి చెప్పుకొచ్చాడు అమర్. ఇక కింద మీద పడ్డ తర్వాత ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ చాలా రొమాంటిక్… ఒక్కొక్కరికి ఒక్కో లవర్!

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫినాలే అస్త్ర గెలిచేందుకు హౌస్ మేట్స్ కి వరుసగా టాస్క్ లు నిర్వహించిన బిగ్ బాస్. వాళ్ళ కోసం స్పెషల్ ఛాయ్ పంపించి గార్డెన్ ఏరియా లో ముచ్చట్లు పెట్టాడు. టీ ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరు తమ లవ్ స్టోరీ ని చెప్పాలని బిగ్ బాస్ తెలిపారు. దీంతో ముందు శివాజీ తన లవ్ స్టోరీ చెప్పాడు. మాస్టర్ సినిమా అయిపోయింది. ఒక పెద్దాయన ఇంట్లో ఫంక్షన్ జరిగితే వెళ్లాను. అక్కడ కలిసాను మా ఆవిడని ఫస్ట్ టైం. అలా మాట్లాడుతూ ఒక సంవత్సరం మా లవ్ స్టోరీ నడిచింది. ఇక తన డిగ్రీ లాస్ట్ ఇయర్ లో మేము పెళ్లి చేసుకున్నాం. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అని చెప్పుకొచ్చాడు శివాజీ.

ఇక తర్వాత శోభా తన ప్రేమ కదా చెప్తూ .. అప్పుడు ఫస్ట్ లాక్ డౌన్ కదా ఆ టైం లో ఇద్దరం ఒకే షూట్ సెట్ లో వర్క్ చేశాం. అనుకోకుండా మా ఇద్దరి మధ్య ఒక సీన్ పడింది. అలా ఎక్కువ సేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకునే సరికి ఐ కనెక్ట్ అయిపోయింది. మల్లి ఇద్దరి మధ్య రెండు ఏళ్ళు గ్యాప్ వచ్చింది. కానీ ఒక రోజు సోషల్ మీడియాలో నాకు హాయ్ అని మెసేజ్ వచ్చింది. అలా మాట్లాడుకునేవాళ్ళం తను చాలా మంచి వాడు అనిపించి .. నేనే ప్రపోజ్ చేశాను. మూడున్నర ఏళ్లుగా సాగుతుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి సిగ్గు పడిపోయింది.

ఇలా వరుసగా అందరూ తమ లవ్ స్టోరీలు చెప్పారు. తర్వాత బిగ్ బాస్ అమర్ ని చెప్పమని అడిగాడు. దీంతో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు అమర్. తర్వాత తన భార్య తేజు గురించి చెప్పుకొచ్చాడు అమర్. ఇక కింద మీద పడ్డ తర్వాత ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. తేజుని అప్పుడే ఫస్ట్ టైం చూడటం. వాళ్ళ సెట్ లోకి వెళ్లి మాట్లాడాను .. నెంబర్ తీసుకున్న .. ఒక ఫ్రెండ్ గా లైఫ్ చాలా హెల్ప్ చేసింది. అది లవ్ గా టర్న్ అవుతుంది అని అనుకోలేదు.

ప్రపోజ్ చేశాను .. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాం. నా లైఫ్ లోకి తేజు వచ్చింది. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది కానీ నా గత జీవితాన్ని అర్థం చేసుకుంది. అన్నింటిని ఓపికగా భరించి నాతో ఉంది. నాకు అది చాలు అంటూ చెప్పుకొచ్చాడు అమర్ దీప్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లవ్ స్టోరీస్ ఆడియన్స్ లో ఆసక్తిరేపాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు