Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఆఖరి నామినేషన్స్… శోభాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ!

ఇక తర్వాత శోభ తనని నామినేట్ చేసినందుకు యావర్ ని నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. తన రెండవ నామినేషన్ శివాజీ కి వేసింది. ‘ మీరు ఎందుకో గివ్ అప్ ఇచ్చారని అనిపించింది అంటూ శోభా రీజన్ చెప్పింది . అయితే శివాజీ ఏమాత్రం తగ్గలేదు .. గివ్ అప్ ఎందుకిస్తాను నేను రేస్ లో ఉండాలని అనుకుంటాను.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఆఖరి నామినేషన్స్… శోభాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ!

Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 13వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి కూడా ఎప్పటిలానే జనాన్ని పిచ్చోళ్లను చేసాడు బిగ్ బాస్. దత్త పుత్రిక ఖాతాలో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బలి చేసాడు. అయితే ఈ సీజన్ చివరి నామినేషన్స్ కి ఏర్పాట్లు చేశారు. ఇక ఆఖరి నామినేషన్స్ కి సంబంధిన ప్రోమోలో శోభా శెట్టి వర్సెస్ యావర్, శివాజీ లకు మాటల యుద్ధం జరిగింది. కాగా ముందుగా యావర్ శోభా ను నామినేట్ చేశారు.

నువ్వు బ్లైండ్ గా ఒకరు మాట ఫాలో అయిపోతావు అని యావర్ చెప్పాడు. ‘ నువ్వు గెట్ లాస్ట్ శెట్టి అని రాయడం నాకు నచ్చలేదు అని శోభా బదులిచ్చింది. తర్వాత నేను పని చేయలేదని చెప్పావు .. శోభా కూడా పని తక్కువ చేస్తుంది కదా అంటూ ప్రియాంక ని నామినేట్ చేశాడు యావర్. ఇంతలో శోభా కలగజేసుకుని ‘ నాతో పోల్చుకోవద్దు .. డిన్నర్ రెడీ అవ్వగానే వస్తావు .. తింటావు .. వెళ్తావు ఏం చేస్తున్నావు అంటూ శోభా ఫైర్ అయింది.

ఇక తర్వాత శోభ తనని నామినేట్ చేసినందుకు యావర్ ని నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. తన రెండవ నామినేషన్ శివాజీ కి వేసింది. ‘ మీరు ఎందుకో గివ్ అప్ ఇచ్చారని అనిపించింది అంటూ శోభా రీజన్ చెప్పింది . అయితే శివాజీ ఏమాత్రం తగ్గలేదు .. గివ్ అప్ ఎందుకిస్తాను నేను రేస్ లో ఉండాలని అనుకుంటాను.

అమర్ నిన్న ఫౌల్ గేమ్ ఆడాడని వీడియో చూపించారు కదా .. మరి అతన్ని ఎందుకు నామినేట్ చేయలేదు .. అది నీకు తప్పు అనిపించలేదా అని శివాజీ అడిగాడు. దానికి నేను నామినేషన్ వేయాలనుకోలేదు అను శోభా చెప్పింది. దీంతో శివాజీ ‘ చూడు శోభా .. నువ్వేదో ఒలింపిక్ పర్ఫామెన్స్ ఇచ్చి నన్ను డామినేట్ చేసి ఉంటే .. నేను నీ నామినేషన్ యాక్సెప్ట్ చేసే వాడ్ని అని అన్నాడు శివాజీ. సీరియల్ బ్యాచ్ శోభకు శివాజీ గట్టి కౌంటర్స్ ఇచ్చారు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు