Bigg Boss 7 Telugu: ఫైనల్ ఓటింగ్ లో ఊహించని ట్విస్ట్… క్రిందకు పడిపోయిన టాప్ కంటెస్టెంట్

ఆరుగురు నామినేట్ అయ్యారు. అనంతరం బిగ్ బాస్ షాకింగ్ మేటర్ రివీల్ చేశాడు. సోమవారం రాత్రి నుండే టైటిల్ రేసుకు ఓటింగ్ జరుగుతుంది.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: ఫైనల్ ఓటింగ్ లో ఊహించని ట్విస్ట్… క్రిందకు పడిపోయిన టాప్ కంటెస్టెంట్

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ మరో రెండు వారాల్లో ముగియనుంది. ఇక నిన్న చివరి నామినేషన్స్ ముగిశాయి. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచారు. కాబట్టి అతన్ని నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్పారు. దీంతో శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, ప్రియాంక, శోభ నామినేషన్స్ లో పాల్గొన్నారు. ఆరుగురు నామినేట్ అయ్యారు. అనంతరం బిగ్ బాస్ షాకింగ్ మేటర్ రివీల్ చేశాడు. సోమవారం రాత్రి నుండే టైటిల్ రేసుకు ఓటింగ్ జరుగుతుంది. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురితో పాటు అర్జున్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అవుతాయి.

నెక్స్ట్ వీక్ కి ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో వారు ఎలిమినేట్ అవుతారు. మిగతా నలుగురు ఫైనల్ కి వెళతారని చెప్పాడు. కాబట్టి వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. టైటిల్ పోరు కావడంతో అభిమానులు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కి ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్ క్రిందకు పడిపోయాడట.

అందరికంటే టాప్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడట. తర్వాత స్థానంలో శివాజీ ఉన్నాడట. గత వారం కూడా శివాజీ, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ లో ప్రశాంత్ పై చేయి సాధించాడు. ఇదే ట్రెండ్ ఈ వారం కూడా కొనసాగుతుంది. ఇక మూడో స్థానంలో స్పై బ్యాచ్ కే చెందిన యావర్ ఉన్నాడట. ఊహించని విధంగా అమర్ నాలుగో స్థానానికి పడిపోయాడట.

అమర్ టైటిల్ రేసులో ఉంటాడు. కనీసం రన్నర్ గా నిలుస్తాడని ఆశిస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఊహించని దెబ్బ అనుకోవచ్చు. ఇటీవల అతని గ్రాఫ్ పెరిగిందని భావిస్తున్నా టైటిల్ కొట్టే రేంజ్ కాదని తేలిపోయింది. ఇక 5వ స్థానంలో అర్జున్ ఉన్నాడట. ఆరవ స్థానంలో ప్రియాంక, ఏడవ స్థానంలో శోభ ఉన్నారట. ప్రస్తుత సరళి ప్రకారం శోభ, ప్రియాంక ఎలిమినేట్ కావాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. టైటిల్ పోరు శివాజీ, ప్రశాంత్ మధ్య ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు