Anil Ravipudi: భగవంత్ కేసరి దర్శకుడికి నిర్మాత కాస్ట్లీ కార్ గిఫ్ట్… ధర ఎంతంటే?

బాలయ్య ఇమేజ్ కి భిన్నంగా డిఫరెంట్ సబ్జెక్టుతో భగవంత్ కేసరి తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ తో మూవీ నడిపించాడు. హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురు సమానమైన పాత్ర చేసింది.

  • Written By: NARESH
  • Published On:
Anil Ravipudi: భగవంత్ కేసరి దర్శకుడికి నిర్మాత కాస్ట్లీ కార్ గిఫ్ట్… ధర ఎంతంటే?

Follow us on

Anil Ravipudi: దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి చిత్రంతో బాలకృష్ణ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆయన గత చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి సైతం విజయం సాధించాయి. అక్టోబర్ 19న విడుదలైన భగవంత్ కేసరి భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సత్తా చాటింది.

బాలయ్య ఇమేజ్ కి భిన్నంగా డిఫరెంట్ సబ్జెక్టుతో భగవంత్ కేసరి తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ తో మూవీ నడిపించాడు. హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురు సమానమైన పాత్ర చేసింది. గతంలో గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయడం విశేషం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మెయిన్ విలన్ రోల్ చేశాడు.

భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు దసరా బరిలో పోటీపడ్డాయి. భగవంత్ కేసరి విన్నర్ గా నిలిచింది. భగవంత్ కేసరి సక్సెస్ నేపథ్యంలో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. షైన్ స్క్రీన్స్ అధినేత అనిల్ రావిపూడి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చారు. టొయోటా వెల్లిఫైర్ బ్రాండ్ న్యూ కారును అనిల్ రావిపూడికి అందించారు. ఈ కారు ధర రూ. 1.2 కోట్లు నుండి 1.3 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

భగవంత్ కేసరితో సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి బ్రాండ్ న్యూ కారు బహుమతిగా అందుకున్నారు. కొద్దిరోజులుగా భగవంత్ కేసరి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ లో భగవంత్ కేసరి అందుబాటులోకి రాగా టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఓటీటీలో కూడా బాలయ్య మూవీ సత్తా చాటుతుంది. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు