spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: ఎవ్వరూ ఊహించని డైరెక్టర్ తో చిరంజీవి.. ఈ కథ క్యారెక్టర్ ఏంటి స్వామి...

Chiranjeevi: ఎవ్వరూ ఊహించని డైరెక్టర్ తో చిరంజీవి.. ఈ కథ క్యారెక్టర్ ఏంటి స్వామి…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ సినిమా థియేటర్ లోకి రావడం లేదు వచ్చే సంవత్సరం ఈ సినిమాని ధియేటర్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక దీంతో మెగా అభిమానులు చిరంజీవిని ఈ సంవత్సరం మనం థియేటర్ లో చూడలేము అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా చేసి ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయినట్టు గా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే అనిల్ రావిపూడి చెప్పిన ఒక కథ చిరంజీవి కి బాగా నచ్చినట్టు గా కూడా తెలుస్తుంది. దాంతో ఈ సినిమాకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఈ సంవత్సరం సమ్మర్ లో సెట్స్ మీదకి తీసుకెళ్లి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమాలని చాలా తొందరగా తెరకెక్కించి రిలీజ్ చేస్తాడు కాబట్టి ఈ టైం లో ఆయన తో ఒక సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని చిరంజీవి అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఇందులో చిరంజీవి ఒక ప్రొఫెసర్ గా కనిపించబోతున్నట్టుగా కూడా వర్థలైతే వస్తున్నాయి. ఇంతకుముందు చిరంజీవి ప్రొఫెసర్ గా ఏ సినిమాలో కనిపించలేదు.

మాస్టర్ సినిమాలో లెక్చరర్ గా కనిపించినప్పటికీ అదొక సపరేట్ క్యాటగిరి మూవీ కావడం వాళ్ల దానికి దీనికి సంబంధం లేకుండా క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు గా తెలుస్తుంది.ఇక అందువల్లే ఇది తనకి కొత్త గా ఉంటుందని అనుకొని ఈ సినిమా చేస్తాను అని చిరంజీవి కమిట్ అయ్యాడు…ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూట్ లో చాలా బిజీ గా ఉన్నాడు.

అందుకే సమ్మర్ వరకు అనిల్ రావిపూడి ఈ సినిమా కి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేసి షూట్ కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు బాలయ్య బాబుకి భగవంత్ కేసరి సినిమాతో అదిరిపోయే హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవి కి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి…

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Narendra Modi Strategy

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...
SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Three Sisters Marry One Man

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Oktelugu Epaper