Atithi Devobhava: అతిధి దేవోభవ’ దారుణాతి దారుణం.. మరీ ఇంత డిజాస్టరా ?

Atithi Devobhava: ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌ గా వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు ఉంది పరిస్థితి. అసలు ఈ ‘అతిథి దేవో భవ’కి రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.28 కోట్లును మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. పాపం బయ్యర్లు ఫుల్ గా బుక్ అయ్యారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో […]

  • Written By: Shiva
  • Published On:
Atithi Devobhava: అతిధి దేవోభవ’  దారుణాతి దారుణం..  మరీ   ఇంత  డిజాస్టరా  ?

Follow us on

Atithi Devobhava: ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌ గా వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు ఉంది పరిస్థితి. అసలు ఈ ‘అతిథి దేవో భవ’కి రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.28 కోట్లును మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. పాపం బయ్యర్లు ఫుల్ గా బుక్ అయ్యారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో భారీగానే నష్టపోయారు.

Atithi Devobhava

Atithi Devobhava

పొలిమేర నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి విపరీతమైన డిజాస్టర్ టాక్ తో కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. అతి దారుణంగా వచ్చాయి ఓపెనింగ్స్. కొన్ని థియేటర్స్ లో అయితే సింగిల్ టికెట్ కూడా తెగ లేదని టాక్ వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ప్లాప్ అయిన సినిమా మరొకటి లేదట.

Also Read:  బంగార్రాజు’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

ఆ స్థాయిలో బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా ఫుల్ క్రెడిట్ ను కొట్టేసింది ఈ ‘అతిధి దేవోభవ’ చిత్రం. ఆది సాయి కుమార్ ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నా.. కనీసం ప్లాప్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమాతో తనకు కొంచెం మార్కెట్ అయినా బిల్డ్ అవుతుందని ఆది చాలా ఆశ పడ్డాడు. అయితే, ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాకపోవడం ఆది బాగా నిరాశ చెందాడు.

ఇక ఈ అతి పెద్ద డిజాస్టర్ కి వచ్చిన ఫస్ట్ వీక్ కలెక్షన్లను చూద్దాం.

ఆంధ్రా : 0.08 కోట్లు
నైజాం 0.12 కోట్లు
సీడెడ్ 0.07 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.27 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.28 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

పాపం మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. అసలు ఊరు పేరు లేని హీరోకి కూడా మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది ఆది సాయి కుమార్ కి మాత్రం అస్సలు కలెక్షన్స్ రాకపోవడం నిజంగా విచిత్రమే. ఒక విధంగా ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమాల్లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. చివరగా ‘అతిధి దేవోభవ’ దారుణాతి దారుణం.

Also Read:  సమంత డైలీ లైఫ్ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా?

Tags

    Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu