Animal Review: అనిమల్ ఫుల్ మూవీ రివ్యూ

అనిమల్ సినిమా కథ విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఈ కథని ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ రివిల్ చేసేసాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరికెక్కిన సినిమా ముఖ్యంగా కొడుకుకి తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఆ కొడుకు తండ్రి కోసం ఏం చేశాడు అనేదే ఈ సినిమా.

  • Written By: Gopi
  • Published On:
Animal Review: అనిమల్ ఫుల్ మూవీ రివ్యూ

Follow us on

Animal Review: ప్రతి ప్రేక్షకుడు తనకున్న టెన్షన్స్ నుంచి రిలీఫ్ పొందడానికి సినిమా థియేటర్ కెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటాడు.అయితే అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకుడి ని తనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోయేలా చేసి ఆ మూడు గంటలు అతన్ని వేరొక లోకంలోకి తీసుకెళ్తుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం బాగలేకపోవడంతో ప్రేక్షకుడు తనకున్న ప్రాబ్లమ్స్ ఏ కాకుండా ఇదొక పెద్ద తలకాయ నొప్పిగా మారుతుంది. అందుకే ప్రేక్షకుడు సినిమా టాక్ తెలిసిన తర్వాత ఏ సినిమా చూడాలి అనేది నిర్ణయించుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు అత్యంత భారీ అంచనాల మధ్య సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ గా అనిమల్ మూవీ తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఇంతకు ముందు వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం లాగే ఈ చిత్రం కూడా సక్సెస్ గా నిలిస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం…

ముందుగా అనిమల్ సినిమా కథ విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఈ కథని ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ రివిల్ చేసేసాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా తెరికెక్కిన సినిమా ముఖ్యంగా కొడుకుకి తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఆ కొడుకు తండ్రి కోసం ఏం చేశాడు అనేదే ఈ సినిమా…అనిల్ కపూర్ ని చంపడానికి చూసిన కొద్దిమంది వ్యక్తులను రన్బీర్ కపూర్ ఎలా చంపాడు అనేదే ఈ సినిమా స్టోరీ ఇక నార్మల్ గా చూస్తే ఇది చిన్న పాయింట్ అయినప్పటికీ ఈ సినిమాలో ప్రతి ఎమోషన్ ని కూడా ఆడియన్స్ పిక్ స్టేజ్ లో ఎంజాయ్ చెసే విధంగా సందీప్ దీన్ని మలిచాడు…

ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది బ్రీఫ్ అనాలసిస్ ద్వారా మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఈ సినిమాలో సందీప్ తండ్రి కొడుకుల ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించాడు. నిజానికి వీళ్లిద్దరి మధ్య ఒక్కో ఎమోషన్ అనేది సినిమాకి స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచింది. అలాగే తండ్రి అంటే ఇష్టమున్న కొడుకు ఒక సైకో మాదిరిగా బిహేవ్ చేస్తుంటే అది చూస్తున్న తండ్రి కూడా దాన్ని చూసి తట్టుకోలేక పోతుంటాడు అంటే కొడుకు అనేవాడు తండ్రి విషయంలో ఎలా ఉండాలి అనేది ప్రతి విషయంలో రన్బీర్ కపూర్ ఎంత డీప్ గా వెళ్లి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అంటే వాడు చేసే ప్రతి పని కూడా ప్రేక్షకులకి నచ్చుతుంది. అలాగే రన్బీర్ కపూర్ చేసిన ప్రతి పని కూడా మనకు నచ్చేలా ఫీల్ ని కలిగించేలా ఈ సినిమాని సందీప్ తీర్చిదిద్దాడు…అయితే ఈ సినిమాలో సందీప్ ఎమోషన్స్ తో ఆడుకున్నాడనే చెప్పాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇస్తూ సందీప్ ఈ సినిమాల్ని అద్భుతంగా తెరకెక్కించాడు. నిజానికి సందీప్ లాంటి డైరెక్టర్ మూడు గంటల పైన సినిమా చేస్తున్నాడు అన్నప్పుడే ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది అంత సేపు సినిమాని చూడగలమా అనేదాని పైన చాలా సందేహలు వ్యక్తం చేస్తున్నప్పటికి మాత్రం దానికి సంబంధించిన క్లియర్ కట్ నరేషన్ ని ఇచ్చేశారు అనే చెప్పాలి. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించి చూసే ఆడియన్ కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేశాడు… మొత్తానికి ఈ సినిమాతో సందీప్ మరొకసారి మ్యాజిక్ చేశాడని చెప్పాలి… అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు అక్కడక్కడ లాక్ గా అనిపించినప్పటికీ ఆ కోర్ ఎమోషన్ తో ఆ సినిమా మొత్తాన్ని సందీప్ లాగించేసాడు… ముఖ్యంగా సందీప్ అనిల్ కపూర్ రన్బీర్ కపూర్ మధ్య కొన్ని సీన్లు మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. ఆ సీన్లకు ప్రతి ఒక్కో ప్రేక్షకుడికి కూడా కళ్ళల్లో నీళ్లు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన రణ్బీర్ కపూర్ తనదైన రీతిలో అద్భుతంగా నటించాడు. అతను ఇంతకుముందు చేసిన సంజు సినిమాలో ఎలాంటి నటన కనబరిచాడు ఈ సినిమాలో అంతకుమించి నటనను చూపించాడు. ఇక తండ్రి పాత్రను పోషించిన అనిల్ కపూర్ కూడా తన పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ గా రష్మిక మందాన కూడా ఒక పర్ ఫెక్ట్ పాత్ర పోషించింది. ముఖ్యంగా రణ్బీర్ కపూర్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకొని తను ఎలా నిలబడగలుగుతుంది అనేది కూడా చాలా అద్భుతంగా చూపించాడు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఈ సినిమా నటన పరంగా కూడా మరొక మెట్టు పైకెక్కిందనే చెప్పాలి…

టెక్నికల్ విషయానికి వస్తే అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన విజువల్స్ ని చాలా అద్భుతంగా చూపించాడు. అలాగే ఈ సినిమా విషయంలో కొన్ని అద్భుతమైన షాట్స్ ని కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అలాగే ఎడిటింగ్ విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి ఎడిటర్ గా కూడా చేయడం సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఏ సీన్ ఎంత లెంత్ లో ఎక్కడి వరకు కట్ చేయాలి అనేది డైరెక్టర్ కి చాలా అద్భుతంగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయనే ఎడిటర్ గా మారి ఎడిటింగ్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి… మ్యూజిక్ కూడా ఓకే అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్లలో అద్భుతంగా పండించారు… ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా

ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే
రన్బీర్ కపూర్ యాక్టింగ్
సందీప్ రెడ్డివంగా డైరెక్షన్
తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్
యాక్షన్ ఎపిసోడ్స్

ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే
సినిమా ఎక్కువ లెంతీగా ఉండడం
మధ్యలో కొన్ని సీన్లు చూస్తున్నంత సేపు ట్రాజెడీగా అనిపించింది…

ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు