Duvvada Srinivas: ఏపీలో జనసేన ఎమ్మెల్సీగా నాగబాబు కొనసాగుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి రాకపోవడంతో నాగబాబు కొద్దిరోజులుగా నారాజ్ గా ఉంటున్నట్టు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక పదవిని కేటాయించారు. అది క్యాబినెట్ ర్యాంకు హోదా పదవి. పర్యావరణ శాఖలో చైర్మన్ హోదాలో ఆయన కొనసాగబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నాగబాబుకు ఏపీ ప్రభుత్వం పదవి ఇవ్వడంతో.. వైసిపి నాయకులు పెద్దగా స్పందించలేదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ వైల్డ్ ఫైర్ లాగా రియాక్ట్ అయ్యారు. అసలు ఆయనలో ఇంత ఫైర్ ఉందని.. ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతారని ఎవరూ ఊహించలేదు.
నాగబాబు కు పదవి ఇవ్వడం ఏంటని దువ్వాడ శ్రీనివాస ప్రశ్నించారు. అసలు నాగబాబు ఎవరని.. ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా .. హైదరాబాదులో నివాసముండే అతనికి పదవి ఏంటని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అంతేకాదు బాక్స్ బద్దలై పోతుందని హెచ్చరించారు.. రాజ్యాంగం అంటే డైనింగ్ టేబుల్ కాదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తి లేదని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ దూరం పెడుతున్నప్పటికీ.. వైసిపికి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా నిత్యం మీడియాలో ఉండడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో దివ్వెల మాధురితో కలిసి చాలావరకు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు దివ్వల మాధురిని పక్కనపెట్టి.. తనే సొంతంగా మీడియా ముందుకు వస్తున్నారు. పైగా తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ టిడిపిలో చేయడానికి ప్రయత్నాలు చేశారు. ద్వారాలు మూసుకుపోయాయి. బిజెపిలో చేరడానికి ప్రయత్నాలు చేశారు.. అక్కడ కూడా సానుకూల స్వాగతం లభించలేదు. జనసేనలో చేరడానికి మంతనాలు జరిపారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ప్రతిస్పందన లభించలేదు. దీంతో మళ్లీ వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. నాగబాబుకు కేబినెట్ హోదా ర్యాంక్ పదవి లభించడంతో దువ్వాడ శ్రీనివాస్ తన అక్కసు బయటపెట్టారు. మరి దీనిపై జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
“అసలు నాగబాబు ఎవరు? ఈ నాగబాబు హైదరాబాద్ లో ఉంటాడు, ఏపీలో మళ్ళీ కేబినెట్ హోదా ఎలా ఇస్తారు?
రాజ్యాంగం అంటే డైనింగ్ టేబుల్ రాజకీయం కాదు.. బాక్స్ బద్దలైపోద్ది!”
– నాగబాబుకు కేబినెట్ హోదాపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
#PawanKalyan #DuvvadaSrinivas #NagaBabu #JanaSena pic.twitter.com/Rtco6J9C1k
— Telugu360 (@Telugu360) August 17, 2026