Nagababu: ఇటీవల ఏపీ పర్యావరణ కార్య నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అటు మీడియాలో.. ఇటు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీసాయి.
ఆ ఉత్తర్వుల ప్రకారం..
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం క్యాబినెట్ స్థాయి వ్యక్తులకు వర్తించే సిబ్బంది.. ఇతర సౌకర్యాలు తోపాటుగా నాగబాబుకు జీతం.. ఇతర ప్రయోజనాల కింద సుమారు నెలకు 4.5 లక్షలు లభిస్తాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నాగబాబుకు “లాభదాయకమైన పదవి” దక్కింది అనే ప్రశ్న వ్యక్తమౌతోంది. నాగబాబు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒకవేళ ఈ కొత్త పదవి ద్వారా పొందే ప్రయోజనాలకు ఆయనకు అర్హత ఉండకపోవచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాజ్యాంగం ఏం చెబుతోంది..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1) (ఎ) ప్రకారం భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద లాభదాయకమైన పదవి కలిగి ఉంటే.. ఆ పదవికి చట్టం ద్వారా ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వనంతవరకు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి లేదా ఆ పదవిలో కొనసాగడానికి అర్హత ఉండదు. దీని ప్రకారం ఏపీ పర్యావరణ కార్య నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి లాభదాయకమైతే.. నాగబాబుకు కేబినెట్ హోదా ద్వారా లభించే ప్రయోజనాలు దూరమవుతాయి. దీనికి తోడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగడానికి అవకాశం ఉంటుందా.. అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది.
మినహాయింపులు ఉన్నాయి
ఒక అభిప్రాయం ప్రకారం కేవలం కేబినెట్ హోదా ఇవ్వడం వల్ల ఒక ఎమ్మెల్సీ అనర్హులుగా మారే అవకాశం లేదు. కొన్ని పదవులు కలిగి ఉన్న వారిని శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించే చట్టాలను రూపొందించేందుకు రాజ్యాంగం రాష్ట్ర శాసనసభకు అధికారమిచ్చింది..ఆంధ్రప్రదేశ్ లో గతంలో “జీతాల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం 1953” ప్రకారం కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు.. కొన్ని పోస్టులకు మినహాయింపులు ఉన్నాయి. అయితే నాగబాబుకి ఇచ్చిన పదవి లాభదాయకమైన పదవి కావచ్చని మరి కొంతమంది వాదిస్తున్నారు.
నాడు జయాబచ్చన్ కేసులో..
గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీ నుంచి ఎంపీగా సినీనటి జయ బచ్చన్ ఎన్నికయ్యారు. నాడు ఆమె ఉత్తరప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది . ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్ పర్సన్ పదవి లాభదాయకమైనదని భావించి.. ఆమెను దాని నుంచి తొలగించారు. ఇప్పుడు నాగబాబు కూడా ఇదే సమస్య ఎదురైతే.. అప్పుడు దానిని ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది . మరోవైపు ఆయనకు కేబినెట్ హోదా కల్పించడం అనేది పెద్ద సమస్య కాదు. నాగబాబు కు దక్కిన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ కార్య నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి చట్టబద్ధంగా లాభదాయకంగా పరిగణిస్తారా?.. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం ఆ నిర్దిష్ట పదవికి మినహాయింపు ఉందా?.. అనేవే ఇక్కడ అసలైన ప్రశ్నలు. వీటికి సమాధానం ఆధారంగానే నాగబాబు పదవి, క్యాబినెట్ హోదా ముడిపడి ఉంటుంది.
Nagababu: నాగబాబుకు ఏ రూల్స్, నిబంధనలు ఉండవు.. ఇది చంద్రబాబు ఇచ్చిన ఫ్రీడం
Nagababu: ఇటీవల ఏపీ పర్యావరణ కార్య నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అటు మీడియాలో.. ఇటు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీసాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వం జారీ […]