Homeఎంటర్టైన్మెంట్2027 Sankranti Movie: 2027 సంక్రాంతికి ఏం జరగబోతుంది... అరడజన్ సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందంటే...

2027 Sankranti Movie: 2027 సంక్రాంతికి ఏం జరగబోతుంది… అరడజన్ సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందంటే…

2027 Sankranti Movie: సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. ఎందుకంటే పండగ వాతావరణం లో సినిమాల్లో రిలీజ్ చేసుకుంటే ఎక్కువ కలెక్షన్స్ ను సంపాదించవచ్చు అనే ధోరణిలో దర్శక నిర్మాతలైతే ఆలోచిస్తున్నారు. ఇక ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సినిమాలను చూడ్డానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి వాటిని క్యాష్ చేసుకోవడానికి చాలామంది దర్శక నిర్మాతలు సంక్రాంతి సీజన్ లో […]

2027 Sankranti Movie: సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. ఎందుకంటే పండగ వాతావరణం లో సినిమాల్లో రిలీజ్ చేసుకుంటే ఎక్కువ కలెక్షన్స్ ను సంపాదించవచ్చు అనే ధోరణిలో దర్శక నిర్మాతలైతే ఆలోచిస్తున్నారు. ఇక ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సినిమాలను చూడ్డానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి వాటిని క్యాష్ చేసుకోవడానికి చాలామంది దర్శక నిర్మాతలు సంక్రాంతి సీజన్ లో వచ్చే సినిమాల కోసం ముందుగానే కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే 2027 సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఇక ఈ మూవీతో పాటు చిరంజీవి – బాబి సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది. శ్రీను వైట్ల – శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి కానుకగానే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక వీటితోపాటుగా హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రవితేజ, శ్రీ విష్ణు హీరోలుగా చేస్తున్న సినిమా సైతం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతుంది.

ఇక వీటితో పాటుగా సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న సంబరాలు ఏటిగట్టు’ సినిమా సైతం జనవరి 12వ తేదీన రిలీజ్ అవ్వబోతుందంటూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే సంక్రాంతి సీజన్ సినిమా వాళ్లకు భారీ ఫైట్ జరగబోతుంది.

ఇక ఇందులో ఎవరు చివరి వరకు నిలబడతారు? ఎవరు మధ్యలో డ్రాప్ అయిపోతారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ పోటీలో ఎవరు విజయాన్ని సాధిస్తారు? అలాగే వీళ్లతో పాటుగా మరి కొంతమంది హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలపబోతున్నారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper