Nandamuri Balakrishna: బాలకృష్ణ డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధం అవుతాడు. ఆయన డెడికేషన్ గురించి ప్రముఖ నటుడు పృథ్వి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు వింటే గూస్ బంప్స్ రాక తప్పదు. సమరసింహా రెడ్డి సినిమా చిత్రీకరణ సమయంలో 100 కీలలో బరువు ఉన్న నన్ను ఎత్తుకొని బాలయ్య 500 మీటర్లు పరిగెట్టారని చెప్పుకొచ్చారు. ఈ సీన్ చేసే ముందు డైరెక్టర్ అంత బరువున్న వ్యక్తిని 500 మీటర్లు ఎత్తుకొని పరిగెత్తడం అసాధ్యం, క్రేన్ లేదా ఇతర సాంకేతిక సహాయం తీసుకోవాలని సూచించారని, కానీ బాలయ్య అవసరం లేదు, నేనే మోస్తాను అని చెప్పారని, స్టార్ట్ , కెమెరా, యాక్షన్ అనగానే బాలయ్య నన్ను అమాంతం ఎత్తుకొని పరిగెత్తారు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ‘దాదా‘ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో కూడా ఆయన ఒక రిస్కీ స్టంట్ చేసి, కాళ్ళు విరగొట్టుకున్నాడు. 70 ఏళ్ళ వయస్సుకి దగ్గరగా ఉన్నప్పటికీ బాలయ్య ఇలాంటి స్తంట్స్ వేస్తున్నాడంటే, కుర్ర వయస్సులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో మీరే ఊహించుకోండి. దాదా చిత్రం వచ్చే నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం లో మంచు మనోజ్ విలన్ గా నటించగా, బాలీవుడ్ టాప్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, మొదటి పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.