Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లక్ష పసుపు కొమ్ముల నోము.. చూడాల్సిన వీడియో ఇది..

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లక్ష పసుపు కొమ్ముల నోము.. చూడాల్సిన వీడియో ఇది..

Duvvada Srinivas: ఆ ఎలివేషన్ అదిరిపోయింది.. ఆ డెకరేషన్ దిమ్మ తిరిగిపోయింది. వాళ్లు ధరించిన పట్టు వస్త్రాలు సూపర్ గా ఉన్నాయి. నడిచిన అడుగులు.. అర్చకుడు చెబుతుంటే వల్లించిన వేదవాక్కులు.. అబ్బో అదంతా చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్ లాగానే ఉంది. ఆ రేంజ్ లో ప్లాన్ చేశారు మరి. ఇదంతా చేసింది ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సతీమణి దివ్వల మాధురి. శ్రీనివాస్.. మాధురికి సంబంధించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వీళ్ళిద్దరూ […]

Duvvada Srinivas: ఆ ఎలివేషన్ అదిరిపోయింది.. ఆ డెకరేషన్ దిమ్మ తిరిగిపోయింది. వాళ్లు ధరించిన పట్టు వస్త్రాలు సూపర్ గా ఉన్నాయి. నడిచిన అడుగులు.. అర్చకుడు చెబుతుంటే వల్లించిన వేదవాక్కులు.. అబ్బో అదంతా చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్ లాగానే ఉంది. ఆ రేంజ్ లో ప్లాన్ చేశారు మరి.

ఇదంతా చేసింది ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సతీమణి దివ్వల మాధురి. శ్రీనివాస్.. మాధురికి సంబంధించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వీళ్ళిద్దరూ ఏపీ రాజకీయాలలో ఎంత సంచలనం సృష్టించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీరిద్దరి వీడియోలే కనిపిస్తూ ఉంటాయి. కేవలం మాటలే కాదు.. చేతలు కూడా.. ఇద్దరు ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చుకున్నారు.. ముద్దులు కూడా పెట్టుకున్నారు.. కొన్ని సందర్భాలలో వారసుడు వస్తున్నాడు అనే హింటు కూడా ఇచ్చారు.

ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలిలో హడావిడి చేశారు. అంతకుముందు ఉత్తరాంధ్ర పోలీస్స్టేషన్లో ఎదుట సంచలన ప్రకటనలు చేశారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే వితండవాదం చేశారు. ఇప్పుడు శ్రావణమాసం సందర్భంగా ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్ తన రూటు మార్చారు.. ఇన్ని రోజులపాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు సాత్వికమైన మనిషి లాగా రూపాంతరం చెందారు. తన భార్య మాధురితో కలిసి లక్ష పసుపు కొమ్ముల వ్రతం చేశారు. పట్టు వస్త్రాలు ధరించి భార్యతో కలిసి కూర్చున్నారు. వచ్చిన ముత్తైదులకు వాయినమిచ్చారు. అంతేకాదు వారికి భోజనాలు కూడా పెట్టారు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర రాజకీయాలలో శ్రీనివాస ఒకసారిగా యాక్టివ్ అయిపోయారు. ఆ మధ్య జగన్ దర్శనం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అవి విజయవంతం కాలేదు. తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు రాలేదు. దీనికి తోడు జనసేనలో చేయడానికి ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా శూన్య హస్తం ఎదురయింది. బిజెపిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీ నాయకులు వద్దన్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నాయకుడిగానే కొనసాగుతున్నారు. ఏనాటికైనా జగన్ నుంచి పిలుపు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. జగన్ మనసు మారాలని.. తన రాజకీయ పునరాగమనం బ్రహ్మాండంగా ఉండాలని మనసులో కోరుకుంటూ అమ్మవారికి తన భార్యతో కలిసి బ్రహ్మాండంగా వ్రతం చేశారు. మరి అమ్మవారు శ్రీనివాస్ పై కరుణాకటాక్షాలు చూపిస్తారా.. ఆయన కోరుకున్నట్టుగా చేస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper