Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన ఎమ్మెల్సీ. కానీ ఆయన ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత ప్రదర్శిస్తారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే శాసనసభకు హాజరు కావడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మండలికి హాజరవుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీలు. అయితే తొలి రోజు మండలి లో మంటలు రేగాయి. డీఎస్సీ 2025లో అక్రమాల అంటూ ఆరోపణలు చేసిన వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డారు మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. చాలా పెద్ద ఎదురు దాడి చేశారు. అయితే అచ్చెనాయుడుకు రాజకీయ ప్రత్యర్థిగా ఉంటారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయారు దువ్వాడ. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
* నాగబాబు కు పదవిపై..
మెగా బ్రదర్ నాగబాబు కు క్యాబినెట్ హోదాతో కూడిన పదవి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ అంశంపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కోసం జనసేన సైనికులు పోరాటం చేయాలా? అసలు జనసేనలో మిగతా నేతలు లేరా అంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కు 50 కోట్లు అంటూ నోరు జారారు. గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం మూలంగానే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ జరిగింది. ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చి కూటమి కట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నించడం మానేసారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. అంతటితో ఆగకుండా నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. దీనిపై జనసైనికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు 50 కోట్లు అంటూ అక్కడితో ఆపేశారు దువ్వాడ. మిగతా విమర్శల వైపు వెళ్లిపోయారు.
* వైసీపీలో తిరిగి చేరేందుకు..
ప్రస్తుతం వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది దువ్వాడ శ్రీనివాస్ పై. అయినా సరే వైసీపీలో తిరిగి చేరుతానన్న ఆశాభావంతో ఉన్నారు దువ్వాడ. కానీ వైసీపీ జిల్లా నేతలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలిలో బొత్సపై అచ్చం నాయుడు ఆ వ్యాఖ్యలు చేసేసరికి స్పందించారు. కానీ అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి అప్పలరాజు మూడు వారాలపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు ఓ కేసులో. కనీసం దాని గురించి స్పందించలేదు. అయితే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ తాపత్రయం చూస్తుంటే తిరిగి వైసీపీలో చేరాలన్న ఆశతోనే.. ఇలా కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పై మరోసారి నోరు జారిన దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జనసైనికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
View this post on Instagram