Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Party : ఆ సీనియర్ ఒత్తిడితో దువ్వాడ పై సస్పెన్షన్ ఎత్తివేత!

YSR Congress Party : ఆ సీనియర్ ఒత్తిడితో దువ్వాడ పై సస్పెన్షన్ ఎత్తివేత!

YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల కిందట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వేటు పడిందే తప్ప ఆయన మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాదిరిగానే మెలుగుతున్నారు. ఆయన కుటుంబ వ్యవహార శైలి కారణంగా అప్పట్లో వైసీపీ నాయకత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడపై సస్పెన్షన్ ఎత్తివేత పై హై కమాండ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ […]

YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల కిందట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వేటు పడిందే తప్ప ఆయన మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాదిరిగానే మెలుగుతున్నారు. ఆయన కుటుంబ వ్యవహార శైలి కారణంగా అప్పట్లో వైసీపీ నాయకత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో దువ్వాడపై సస్పెన్షన్ ఎత్తివేత పై హై కమాండ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ శ్రీకాకుళం జిల్లా నాయకులకు మాత్రం ఇది సహించరాని విషయం. వారి అభిప్రాయాన్ని కోరగా.. దువ్వాడ వస్తే మళ్లీ క్రమశిక్షణ తప్పుతారని.. తీసుకుంటే మీ ఇష్టం అంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్లీ దువ్వాడను పార్టీలోకి రప్పించేందుకు మొగ్గు చూపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

* వైసిపి ఎమ్మెల్సీ గానే..
దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది తప్ప.. ఆయన వైసీపీ ఎమ్మెల్సీ గానే చలామణి అవుతున్నారు. మొన్న శాసనమండలిలో జరిగిన పరిణామాల క్రమంలో బొత్స సత్యనారాయణ కు అండగా నిలిచారు దువ్వాడ శ్రీనివాస్. మంత్రి అచ్చం నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసిపి ఎమ్మెల్సీల కంటే దూకుడు తనం ప్రదర్శించారు. ఈ క్రమంలోనే దువ్వాడను తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వెనక్కి తీసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

* ధర్మాన వైఖరితో..
ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు బొత్స సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం నడిచింది. మాజీ మంత్రి అప్పలరాజు పరామర్శకు అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు కంటే బొత్స సత్యనారాయణ హైలెట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో పక్క జిల్లా నేత పెత్తనం ఏంటి అని ధర్మాన కుమారుడు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇది బొత్స వరకు తెలియడంతో.. శ్రీకాకుళం జిల్లాలో ధర్మానకు ప్రత్యర్ధులుగా దువ్వాడ శ్రీనివాస్ తో పాటు తమ్మినేని సీతారాం ఇప్పుడు బొత్సతో చేతులు కలిపినట్లు ఒక ప్రచారం నడుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పై బొత్స ఒత్తిడి పెంచి.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ ఉంది. త్వరలో దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper