Homeఆంధ్రప్రదేశ్‌Konidela Nagababu : హమ్మయ్య.. నాగబాబు ఆశించినట్టే క్యాబినెట్.. కానీ!

Konidela Nagababu : హమ్మయ్య.. నాగబాబు ఆశించినట్టే క్యాబినెట్.. కానీ!

Konidela Nagababu : మెగా బ్రదర్ నాగబాబు కీలక బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కిందట ఆయన ఎమ్మెల్సీగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్యాబినెట్ హోదా తో కూడిన పదవి చేపట్టారు. బాధ్యతలు స్వీకరించారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇది క్యాబినెట్ హోదాతో కూడుకున్న పదవి. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు క్యాబినెట్ హోదాతో ఈ పదవి ఇటీవల ప్రకటించారు. ప్రత్యేక కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకు […]

Konidela Nagababu : మెగా బ్రదర్ నాగబాబు కీలక బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కిందట ఆయన ఎమ్మెల్సీగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్యాబినెట్ హోదా తో కూడిన పదవి చేపట్టారు. బాధ్యతలు స్వీకరించారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇది క్యాబినెట్ హోదాతో కూడుకున్న పదవి. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు క్యాబినెట్ హోదాతో ఈ పదవి ఇటీవల ప్రకటించారు. ప్రత్యేక కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మరోవైపు నాగబాబు దంపతులు ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. నాగబాబు దంపతులకు జ్ఞాపికలను అందజేయడమే కాదు ఆత్మీయంగా సత్కరించారు చంద్రబాబు.

* కీలక బాధ్యతలు..
ఏపీలో పచ్చదనం పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ ధ్యేయంగా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పని చేస్తుంది. దీని పరిధి కూడా విస్తృతం. అటువంటి కమిటీకి అధ్యక్షుడిగా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు క్యాబినెట్ హోదా తో కూడిన ఈ పదవి ఇవ్వడం విశేషం. అయితే ఈ పదవి పవన్ కళ్యాణ్ శాఖకు దగ్గరగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్ద నాలుగు శాఖలు ఉన్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తో పాటు అటవీ శాఖ, పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్ వద్ద ఉంది. అయితే ఈ శాఖలన్నీ పెద్దవి. పని విభజనలో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు కు ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా నాగబాబు బాధ్యతల స్వీకారం అట్టహాసంగా సాగింది. క్యాబినెట్ హోదాకు అవసరమైన అన్ని హాంగులు సమకూరాయి.

* కేంద్ర రాజకీయాలపై ఆసక్తి..
రాజ్యసభకు ఎంపికై కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలి అనేది నాగబాబు ఆలోచన. అయితే రాజ్యసభ పదవుల ప్రకటన సమయంలో రకరకాల సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వివిధ సమీకరణలో భాగంగా నాగబాబుకు అవకాశం కల్పించలేకపోయామని.. కానీ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అన్నట్టుగానే ఏడాదిన్నర కిందట ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటినుంచి నాగబాబుకు మంత్రి పదవి అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. చివరకు ఇప్పుడు క్యాబినెట్ హోదా తో కూడిన పదవి లభించింది. అయితే ఈ హోదాతో సరిపెడతారా? లేకుంటే మంత్రిగా అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Babaji Kakarla (@babaji_kakarla)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper