Bigg Boss 10 Telugu: రోహిత్ ఎలిమినేషన్ తర్వాత, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 2 స్థానాల్లో ఎవరెవరు ఉంటారు అని అడిగితే , షో చూసే ప్రతీ ఒక్కరు త్రిగున్, ముకేష్ పేర్లే చెప్తారు. అయితే త్రిగున్ మాత్రం నిన్న మిడ్ నైట్ టాక్స్ లో ముకేశ్ టాప్ 5 లో ఉండదు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గేమ్ ని పర్ఫెక్ట్ గా రీడ్ చేసే త్రిగున్, ముకేశ్ ఓటింగ్ లో టాప్ 2 లో ఉన్నాడనే విషయాన్నీ పసిగట్టకుండా ఉంటాడా?, కచ్చితంగా అతనికి ముకేశ్ రేంజ్ తెలుసు, అయినప్పటికీ కూడా ఇలా మాట్లాడాడంటే కచ్చితంగా ఎదో పెద్ద స్కెచ్ వేస్తున్నాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. రోహిత్ ని ఎలా అయితే హౌస్ మేట్స్ ఓట్లతో బయటకు పంపేలా చేసాడో, ముకేష్ కి కూడా త్రిగున్ అలాంటి పరిస్థితి క్రియేట్ చేయబోతున్నట్టు అర్థం అవుతోంది.
ఒకవేళ ముకేశ్ ని ఎలిమినేట్ చేస్తే, వచ్చే సీజన్స్ పై ఆడియన్స్ పూర్తిగా ఆసక్తి చూపడం మానేస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ముకేశ్ ని దొంగదెబ్బ తీసి త్రిగున్ టైటిల్ గెలిచినా కూడా, ఆ గెలుపుకి ఎలాంటి విలువ ఉండదు. రోహిత్ ఎలిమినేట్ అయ్యాక హౌస్ మొత్తం వీక్ అయ్యింది. సరైన కంటెస్టెంట్స్ లేరు. ఉన్నవారిలో త్రిగున్, ముకేశ్ కాస్త బెటర్. వీరిలో ఒకరిని ఆడియన్స్ ఓటింగ్ కి విలువ ఇవ్వకుండా ఎలిమినేట్ చేస్తే మాత్రం బిగ్ బాస్ టీం షో ఫార్మాట్ ని చేతులారా నాశనం చేసినట్టే అవుతుంది. అంతటి సాహసం చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ చేస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపం లో తెలియజేయండి.