KA Paul: కేఏ పాల్ మళ్లీ ముందుకు వచ్చారు. పొలిటికల్ సెటైరికల్ విమర్శలు ప్రారంభించారు. ఈసారి ఆయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసుకున్నారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో బొత్స మాట్లాడారు. మధ్యలో కేఏ పాల్ ప్రస్తావన తీసుకొస్తూ.. చాలా ఎగతాళిగా మాట్లాడారు. దానిని తట్టుకోలేకపోయారు కే ఏ పాల్. ఆయన మంత్రి ఎలా అయ్యారు అంటూ బొత్సపై విరుచుకుపడ్డారు. దేవుడు ఇప్పటికే ఆయనకు నత్తి ఇచ్చారని.. ఇప్పటికీ బుద్ధి రాలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే దేవుడే శిక్షిస్తాడు అంటూ దేవదూత కేఏ పాల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కేఏ పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* విజయసాయి రెడ్డి పై విమర్శలు చేసే క్రమంలో..
జగన్ చుట్టూ ఉన్న కోటరీ పై ఆరోపణలు చేస్తూ విజయసాయిరెడ్డి 2 పేజీల లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనపై నమ్మకద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీలో తనకు ఎదురైన అవమానాలు, బాధల గురించి చెప్పుకున్నారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న తనను సజ్జల రామకృష్ణారెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి అంటూ బొత్స ప్రస్తావన పరోక్షంగా తీసుకొస్తూ విమర్శలు చేశారు. అయితే దానిపై బొత్స మాట్లాడారు. విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటుపై చులకనగా మాట్లాడుతూ.. కేఏ పాల్ కూడా ఒక పార్టీ పెట్టారంటూ చాలా తేలిగ్గా మాట్లాడారు. అయితే మధ్యలో తన పేరు తీసుకురావడానికి కేఏ పాల్ సహించుకోలేకపోయారు.. అందుకే బొత్సను గట్టిగా ఇచిపడేసారు.
* శాంతి స్థాపనలో ఉంటే..
ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా.. శాంతి కోసం తాను తిరుగుతుంటే.. తనను ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కే ఏ పాల్. ఆ నత్తోడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఓట్లు కోసం నా కాలి వద్ద నిల్చోలేదా అంటూ ప్రశ్నించారు. నేను ఇచ్చిన డబ్బు తీసుకోలేదా అంటూ నిలదీశారు. లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను రాజకీయాల్లోకి వస్తే.. తనను తక్కువ చేసి మాట్లాడడం ఏంటని కేఏ పాల్ బాధపడ్డారు. దేవుడు ఇప్పటికే నత్తి ఇచ్చారని.. అయినా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే దేవుడే శిక్షిస్తాడు అంటూ హెచ్చరించారు. తక్షణం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
View this post on Instagram