Galwan Valley Clash: సరిగ్గా కొద్ది సంవత్సరాల క్రితం భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం చైనా సైనికులు. అదును చూసి భారత సైన్యాన్ని దెబ్బ కొట్టడానికి చైనా సైన్యం ప్రయత్నించింది. అయితే చైనా సైన్యం కుట్రలను భారత్ అదే స్థాయిలో తీపి కొట్టింది.
నాడు జరిగిన ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది. చివరికి చైనా కుట్రలను ప్రపంచ వేదికల ముందు బయట పెట్టడంలో భారత్ విజయవంతమైంది. అప్పటినుంచి చైనా దేశంతో ఉన్న సరిహద్దుల్లో భారత్ సైన్యాన్ని మరింత కట్టుదిట్టడం చేసింది. భద్రతను మరింత పటిష్టం చేసింది. అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంది. చైనా కుట్రల గురించి తెలుసు కాబట్టి.. అత్యంత కీలకమైన చికెన్ నెక్ రహదారి విషయంలో భారత్ దృఢమైన వైఖరి ప్రదర్శిస్తోంది. తద్వారా చైనా దేశానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తొక్కి పెడుతోంది.
నాడు గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు కీలకమైన చైనా అధికారి ఇప్పుడు కనిపించడం లేదు. 2017 డొక్లాం.. 2020 గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలకు ప్రధాన కారణమైన చైనా జనరల్ జావో జాంకి కనిపించడం లేదు.. అతడు బహిరంగ కార్యకలాపాలలో అగుపించడం లేదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం ఇతరు మాత్రమే కాకుండా ఊ షేజావ్, జూ షాన్గ్లింగ్, వాగ్నింగ్, జంగ్ హే వంటి అనేకమంది సీనియర్ అధికారులు కూడా కనిపించడం లేదు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చైనా అధ్యక్షుడు జిన్ పిం గ్ తన అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి.. సైన్యంలో మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్తు కాలంలో తనకు పోటీగా మారి అధికారులను తొలగించినట్లు తెలుస్తోంది. సీనియర్ జనరల్ అధికారులను వయసు రీత్యా తొలగించినట్టు సమాచారం.. ఈ తొలగింపు జాబితాలో భారత్ చైనా సరిహద్దు వివాదాలకు సంబంధించిన వెస్టర్న్ కమాండ్ విభాగానికి చెందిన పలువురు అధికారులు తొలగింపునకు గురయ్యారు. నాడు ఈ అధికారుల దూకుడు వల్లే చైనా అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ తొలగింపులు చైనా సైన్యంలోకి యువ రక్తాన్ని తీసుకురావడానికి అని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అంతర్గత కారణం వేరే ఉంది.
సరిహద్దు ప్రాంతాలలో దుస్సాహసాల వల్ల చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ చైనా ఆర్మీలో జరుగుతున్న ఈ అంతర్గత పరిణామాలు యావత్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఈ అధికారుల తొలగింపును చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదంటే అంతర్గతంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.