Homeఆంధ్రప్రదేశ్‌Vijay Sai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిని అలా క్లోజ్ చేశారా?!

Vijay Sai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిని అలా క్లోజ్ చేశారా?!

Vijay Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల విరుచుకుపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి పై. అడుగడుగునా అవమానాలు తట్టుకోలేక తాను వైసీపీ నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే దీనికి ముమ్మాటికీ ఆ కోటరీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రితో కుట్ర చేసి తనను సమన్వయకర్త పదవి నుంచి తొలగించారని చెప్పారు. సదరు ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పార్టీ […]

Vijay Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల విరుచుకుపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి పై. అడుగడుగునా అవమానాలు తట్టుకోలేక తాను వైసీపీ నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే దీనికి ముమ్మాటికీ ఆ కోటరీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రితో కుట్ర చేసి తనను సమన్వయకర్త పదవి నుంచి తొలగించారని చెప్పారు. సదరు ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారంటూ కొచ్చారు. ఇటీవల వైసిపికి గుడ్ బై చెప్పి బొత్స సత్యనారాయణలో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో.. అందరి అనుమానం ఆయన పైనే ఉంది. అయితే నాడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి తొలగింపు వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరు మాత్రమే కాదు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ఉన్నారని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు చేసి విజయసాయిరెడ్డిని తప్పించారని ఇప్పుడు అర్థం అవుతోంది.

* ఒక్కొక్క పదవికి కోత..
వాస్తవానికి కేంద్ర కార్యాలయంలో ఉండేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పట్లో విజయసాయి రెడ్డి వద్ద సోషల్ మీడియా విభాగంతో పాటు అనుబంధ సంఘాలు అన్ని ఆయన కనుసన్నల్లో పనిచేసేవి. కానీ ఒక్కొక్కటి అప్పట్లో సజ్జల హస్త గతంలోకి వచ్చాయి. తరువాత ఉత్తరాంధ్ర సమన్వయ పదవి నుంచి కూడా విజయసాయి రెడ్డిని తొలగించారు. అప్పట్లో విశాఖ ఎంపీగా ఉన్న సత్యనారాయణ సైతం విజయసాయిరెడ్డి తీరుపై ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఆయన.. ఏపీలో ఆ వ్యాపారం చేయలేమని.. హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేసుకోవాల్సి వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అలా ఆరోపించిన తర్వాత మాత్రమే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి అప్పట్లో తొలగించారు.

* ఆ సీనియర్లంతా కలిసి..
మొత్తం ఉత్తరాంధ్ర నేతలంతా కలిసి విజయసాయిరెడ్డిని అప్పట్లో తొలగించారు అనేది ఇప్పుడు బయటపడుతోంది. సాధారణంగా ఉత్తరాంధ్ర నుంచి రాజకీయంగా ఎదిగిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులతో ఊహించుకుంటే విజయసాయిరెడ్డి చాలా జూనియర్ నాయకుడు. వారిద్దరూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పని చేశారు. అటువంటి వారు విజయసాయిరెడ్డి పెత్తనాన్ని సహించుకోలేకపోయారని అర్థం అవుతోంది. ఆ ఇద్దరు మాత్రమే కాదు ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం విజయసాయిరెడ్డి పై హై కమాండ్ కు ఫిర్యాదులు చేశారు. అయితే తాడేపల్లి కార్యాలయ ఇన్చార్జిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా… అప్పట్లో విజయసాయిరెడ్డిని క్లోజ్ చేశారన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper