Homeటాప్ స్టోరీస్Chiranjeevi  : చిరు లీక్స్.. మళ్లీ దొరికిపోయిన మెగాస్టార్.. ఇలా అయితే కష్టమే

Chiranjeevi  : చిరు లీక్స్.. మళ్లీ దొరికిపోయిన మెగాస్టార్.. ఇలా అయితే కష్టమే

Chiranjeevi:  బాబీ దర్శకత్వంలో.. కేవీఎన్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం పేరు కాకా. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ లో చిరంజీవి మధ్య వయసు ఉన్న వ్యక్తిగా కనిపించారు. పైగా రొయ్యలు రవాణా చేసే కంపెనీలో పనిచేసే వ్యక్తిగా ఆయన దర్శనమిచ్చారు. చిరంజీవి పాత్ర ఎలా ఉంటుంది.. సినిమా కథ […]

Chiranjeevi:  బాబీ దర్శకత్వంలో.. కేవీఎన్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం పేరు కాకా. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ లో చిరంజీవి మధ్య వయసు ఉన్న వ్యక్తిగా కనిపించారు. పైగా రొయ్యలు రవాణా చేసే కంపెనీలో పనిచేసే వ్యక్తిగా ఆయన దర్శనమిచ్చారు.

చిరంజీవి పాత్ర ఎలా ఉంటుంది.. సినిమా కథ ఎలా ఉంటుంది ఇంతవరకు బయటకి తెలియలేదు. కాకపోతే ఈ సినిమాలో నివేదా పేతురాజ్.. అనస్వర ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి గతంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటించారు. సంక్రాంతి కానుక వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బాబి, చిరంజీవి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా చిరంజీవి గతంలో నటించిన అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. వాల్తేరు వీరయ్య కూడా నిర్మాతకు.. డిస్ట్రిబ్యూటర్లకు.. ఎగ్జిబిటర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాలో.. ఆయన పాత్ర పేరును చిరంజీవి బయట పెట్టారు. తన పుట్టిన ఊరు పేరే కాకా సినిమాలో తన పాత్రకు ఉంటుందని చిరంజీవి ప్రకటించారు. తద్వారా తన పాత్ర పేరు కదిరి కాళిదాస్ అని చిరంజీవి చెప్పకనే చెప్పారు. దీంతో ఈ సినిమా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చిరంజీవి మాస్, క్లాస్ పాత్రల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఏ ఒక్క వివరాన్ని కూడా దర్శకుడు బాబి బయటికి లీక్ చేయడం లేదు. కాని చిరంజీవి స్వయంగా తన పాత్ర గురించి చెప్పడం.. అది కూడా ఆయనే లీక్ చేయడం విశేషం.

తన పాత్ర పేరు బయటపెట్టిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కదిరి కాళిదాసు అనే యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కదిరి ప్రాంతంలో ఉగ్ర నరసింహుడు కొలువై ఉన్నాడు. కాకా సినిమాలో కూడా చిరంజీవి పాత్ర ఉగ్ర నరసింహుడిగా ఉంటుందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి ఔట్అండ్ ఔట్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమాలో కూడా అలాగే కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా సినిమా కూడా భారీ వ్యయంతో రూపొందుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper