Homeఎంటర్టైన్మెంట్S S Rajamouli: రాజమౌళి తన క్లోజ్ ఫ్రెండ్ ను హీరోగా పెట్టి మూవీ చేశాడుగా...ఆ...

S S Rajamouli: రాజమౌళి తన క్లోజ్ ఫ్రెండ్ ను హీరోగా పెట్టి మూవీ చేశాడుగా…ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే…

S S Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో 12 మూవీస్ తో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఘనత తనకే దక్కింది. వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో తను మొదటి స్థానంలో ఉండడం విశేషం…ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ […]

S S Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే అందులో 12 మూవీస్ తో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఘనత తనకే దక్కింది. వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో తను మొదటి స్థానంలో ఉండడం విశేషం…ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు అంటే రాజమౌళి ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమైన మహేష్ బాబుని ఈ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మార్చడంలో రాజమౌళి కీలకపాత్ర వహించబోతున్నాడనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది…

రాజమౌళి స్నేహితుడు అయిన రాజీవ్ కనకాల కెరియర్ మొదట్లో విలన్ పాత్రలను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చాడు. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘ సినిమాలో సైతం లీడ్ రోల్ లో నటించాడు.

అయినప్పటికి ఈ సినిమాలేవి ఆశించిన మేరకు విజయాలను సాధించకపోవడంతో రాజీవ్ కనకాల హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అదే సమయంలో రాజమౌళితో రాజీవ్ కనకాల తనని హీరోగా పెట్టి ఒక సినిమా చేయమని ప్రపోజల్ కూడా పెట్టారట. కానీ రాజమౌళి అప్పుడు బిజిగా ఉండటం వల్ల తన రాజీవ్ కనకాలను హీరోగా పెట్టి డైరెక్ట్ చేయకపోయిన తన ప్రజెంట్స్ లో ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ అనే సినిమా చేశాడు.

అది అనుకున్న మేరకు సక్సెస్ సాధించలేదు. నిజానికి వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కలిసి మెలిసి ఉంటున్నారు. రాజమౌళికి జక్కన్న అనే పేరును సైతం రాజీవ్ కనకాలనే పెట్టాడు. అందువల్లే ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్ లో వీళ్ళు కూడా ఒకరని చెప్పొచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper