Homeఆంధ్రప్రదేశ్‌Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలను వదిలి దివ్వెల మాధురి తో ప్రేమాయణం నడపడం , ఆ తర్వాత వీళ్లిద్దరి పై సోషల్ మీడియా లో వచ్చినటువంటి ట్రోల్స్, మీమ్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా వచ్చిన ఫేమ్ తోనే దివ్వెల […]

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలను వదిలి దివ్వెల మాధురి తో ప్రేమాయణం నడపడం , ఆ తర్వాత వీళ్లిద్దరి పై సోషల్ మీడియా లో వచ్చినటువంటి ట్రోల్స్, మీమ్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా వచ్చిన ఫేమ్ తోనే దివ్వెల మాధురి ‘బిగ్ బాస్ 9’ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చింది , ఉన్న కొద్దీ వారాల్లోనే హౌస్ ని షేక్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించింది. ఇకపోతే రీసెంట్ గా దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల విచారణకు హాజరు అవ్వడం , తన భర్తని పోలీసులు తీసుకెళ్లారంటూ మాధురి పెద్ద ఎత్తున ధర్నా చేయడం వంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యం లో ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ మరోసారి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లో జాఫర్ అడిగిన ప్రశ్నలకు ఈ జంట ఇచ్చిన రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. జాఫర్ మాధురి తో మాట్లాడుతూ ‘కాక్రోచ్ పార్టీ లో చేరిపోండి’ అని అంటారు. అందుకు మాధురి సమాధానం ఇస్తూ ‘ఏమో నేనే ఒక బట్టర్ ఫ్లై పార్టీ పెడుతానేమో’ అని అంటుంది. మరి మీ పార్టీ ఉద్దేశ్యం ఏంటి ? అని జాఫర్ అడగ్గా, ‘ఇలాగే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ పార్టీ ద్వారా పోరాడుతాం’ అంటూ చెప్పకొస్తుంది మాధురి. అనంతరం దువ్వాడ ని జాఫర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘సార్ వీడియోలు ఎక్కడ దాచిపెట్టారు?’ అని అడుగుతారు.

అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సీరియస్ గా రియాక్షన్ ఇస్తూ ‘ఏమి వీడియోలు?’ అని అడుగుతారు , అప్పుడు జాఫర్ ‘అదే స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారు అన్నారు కదా , అందుకు సంబంధించిన వీడియోలు’ అని అడుగుతారు జాఫర్. దువ్వాడ ని వీడియోలు ఎక్కడ దాచారు అడిగిన వెంటనే అతను ఇచ్చిన రియాక్షన్ చూస్తే , ఇతను వేరే టైపు వీడియోల గురించి అడిగారని అనుకున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ వీడియో లో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ మీమ్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Jaffar Babu (@itlu_mee_jaffar)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper