Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో తండ్రైన అర్జున్… ఇదేం ట్విస్టు!

హౌస్ మేట్స్ తెగ కష్టపడి పిల్లల్ని ఆడించారు. ఈ క్రమంలో ప్రిన్స్ యావర్ ఓ బేబీ తీసుకున్నాడు. అర్జున్ మరో బేబీ ని తీసుకున్నాడు. ఆ బొమ్మలకు తినిపించడం, ఆడించడం, లాలించడం చేశారు.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో తండ్రైన అర్జున్… ఇదేం ట్విస్టు!

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కొన్ని ఫన్ టాస్క్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఇంతకు ముందు కిల్లర్ టాస్క్ లో తనకు ఓ భార్య ఉందంటూ పరిచయం చేశాడు బిగ్ బాస్. కాగా నిన్నటి ఎపిసోడ్ లో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని .. ఒకరి పేరు బేబీ .. ఇంకొకరు బీబీ అని చెప్పారు బిగ్ బాస్. ఆ ఇద్దరి పిల్లల్ని లోపలికి పంపించి .. నేను షాపింగ్ కి వెళ్తున్నాను .. వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పారు.

దీంతో హౌస్ మేట్స్ తెగ కష్టపడి పిల్లల్ని ఆడించారు. ఈ క్రమంలో ప్రిన్స్ యావర్ ఓ బేబీ తీసుకున్నాడు. అర్జున్ మరో బేబీ ని తీసుకున్నాడు. ఆ బొమ్మలకు తినిపించడం, ఆడించడం, లాలించడం చేశారు. యావర్ ఇంకా అర్జున్ పిల్లలకు ఏం కావాలో అందిస్తూ చాలా చక్కగా చూసుకున్నారు. ముఖ్యంగా అర్జున్ అయితే తన సొంత బిడ్డగా భావించి .. పాలు తాగించి పడుకోబెట్టుకోవడం, ఆడించడం లాంటివి చేసాడు.

మరోవైపు యావర్ కూడా చాలా చక్కగా చూసుకున్నాడు. చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా సౌండ్స్ చేస్తూ బాగా ఆడించాడు. ఇంట్లో వాళ్లంతా టాస్క్ లో పాల్గొన్నప్పటికీ .. అర్జున్ , యావర్ లు ఎక్కువగా పిల్లల బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా అర్జున్ మరింత ప్రేమగా చూసుకున్నాడు.

ప్రస్తుతం అర్జున్ భార్య ప్రెగ్నెంట్ .. త్వరలోనే అతడు తండ్రి కాబోతున్నాడు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ బేబీ ని బాగా ఆడించి మార్కులు కొట్టేసాడు. బేబీ కూడా మాట్లాడుతూ .. మీరు మంచి తండ్రిలా కనిపిస్తున్నారు అంటూ పొగిడింది. దీంతో అర్జున్ ఆనందంలో తేలిపోయాడు. ఫుల్ కుష్ అయిపోయాడు అర్జున్. దీంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. కాగా అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. మిగతా ఆరుగురిలో నలుగురి ఫైనల్ కి వెళ్లాల్సి ఉంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు