‘సమంత’తో అల్లు అర్హ పోటీ.. మురిసిపోయిన బన్నీ !

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘అక్కినేని సమంత’ మెయిన్ లీడ్ గా వస్తోన్న మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెర పై ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అర్హ ఈ రోజు షూట్ లో పాల్గొంది. తన కూతురు ఎలా నటిస్తోందో చూసేందుకు అల్లు అర్జున్‌ స్వయంగా శాకుంతలం సినిమా షూటింగ్ కి వెళ్లారు. సెట్‌ లో తన ముద్దుల తనయ సమంతతో పోటీ పడి మరీ డైలాగ్ […]

  • Written By: Raghava
  • Published On:
‘సమంత’తో అల్లు అర్హ పోటీ..  మురిసిపోయిన బన్నీ !

Follow us on

Allu Arjun daughter Arha actingభారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ‘అక్కినేని సమంత’ మెయిన్ లీడ్ గా వస్తోన్న మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెర పై ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అర్హ ఈ రోజు షూట్ లో పాల్గొంది. తన కూతురు ఎలా నటిస్తోందో చూసేందుకు అల్లు అర్జున్‌ స్వయంగా శాకుంతలం సినిమా షూటింగ్ కి వెళ్లారు.

సెట్‌ లో తన ముద్దుల తనయ సమంతతో పోటీ పడి మరీ డైలాగ్ లు చెబుతుంటే.. బన్నీ తెగ మురిసిపోయాడు. పైగా అల్లు అర్జున్‌ తో పాటు ఆయన సతీమణి స్నేహ రెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌ లు కూడా షూట్ కి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో శాకుంత‌లగా సమంత నటిస్తుంది.

మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలోనే అల్లు అ‍ర్హ కనిపించనుంది. దర్శకుడు గుణశేఖర్ అర్హ పాత్రను చాల క్యూట్ గా డిజైన్ చేశాడట. ఇప్పటికే అర్హ షూట్ లో కూడా పాల్గొని కొన్ని సీన్స్ లో కూడా నటించింది. అర్హ సీన్స్ చాలా బాగా వచ్చాయట. అర్హ అల్లరి సినిమాలో హైలైట్ అవుతుందట.

ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో అర్హ నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననుంది. మొత్తానికి గుణశేఖర్ స్టార్ వారసుల్ని తెరపైకి తీసుకురావడంలో దిట్ట. గతంలో ఎన్టీఆర్ ని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడుతుంది. ఒక్క మేకప్ కోసమే సుమారు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని మరీ మేకప్ వేయించుకుంటుంది.

 

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు