Nepal Floods : నేపాల్ దేశంలో వచ్చిన వరదలు విపరీతమైన నష్టాన్ని కలగజేసాయి. ఈ కథనం రాసే సమయం వరకు ఆ దేశంలో మొత్తంగా 150 మంది చనిపోయారు. వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు. ఇందులో 341 మంది విదేశాలకు చెందిన వారని అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో 133 మంది భారతీయులు కూడా ఉన్నారు.
నేపాల్ దేశంలో బోటే కోసి, త్రిశూల్ నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. దీంతో నేపాల్ దేశాన్ని సర్వ నాశనం చేశాయి. గండక్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఈ నష్టం తీవ్రత అధికంగా ఉంది.. జల విలయం ధాటికి ఎక్కడి వారు అక్కడే అన్నట్టుగా జల సమాధి అయిపోయారు.. దాదాపు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లిన భక్తుల ఆచూకీ కూడా లభించడం లేదని అధికారులు అంటున్నారు. 91 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 93 మదిని కాపాడారు.. నేపాల్ లోని రసూవా, నువాకోట్, దాడుంగ్, చిత్వాన్ జిల్లాలలో ప్రాణ నష్టం అధికంగా ఉంది. 72 మంది మృతదేహాలను ఇక్కడి నుంచి వెలికి తీశారు.
టిబెట్ సరిహద్దుల్లో దాడింగ్ జిల్లాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం ఒక్కసారిగా వరద వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వర్షన్ లేకపోయినప్పటికీ ఉదయం తొమ్మిది గంటల సమయంలోనే క్షణాల వ్యవధిలో భారీగా వరద వచ్చేసింది. వరద తీవ్రతకు సర్వనాశనమైంది. గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. పెద్దపెద్ద భవనాలు నేల కూలిపోయాయి. సర్వం నాశనమైంది. వందల మంది కనిపించకుండా పోయారు. పెద్ద పెద్ద బండ రాళ్లు కొట్టుకు వచ్చాయి. ఫీట్ల లోతులో బురద పేరుకుపోయింది.. ఈ విలయం సృష్టించిన నష్టం వందల కోట్లలో ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
నేపాల్ దేశం ఇప్పటికే వరదలతో ఇబ్బంది పడుతుంటే.. ఇంకో మహా ప్రళయం పంచుకుందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న ఎగువ ప్రాంతంలో వరద నీరు బ్లాక్ అయిందని.. ఈ క్షణమైనా సరే అది బ్రేక్ అయ్యి కిందికి రావచ్చని వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నేపాల్ కేంద్రంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ హింద్ ఖుష్ పర్వత శ్రేణుల పరిధిలో ఉన్న ఎనిమిది దేశాలకు సేవలు అందిస్తోంది.