Homeఅంతర్జాతీయంNepal Floods: 60 గంటల పాటు మృత్యువుతో.. నేపాల్ లో ఆరేళ్ల బాలిక అద్భుతం..కన్నీళ్లు పెట్టిస్తున్న...

Nepal Floods: 60 గంటల పాటు మృత్యువుతో.. నేపాల్ లో ఆరేళ్ల బాలిక అద్భుతం..కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Nepal Floods: చుట్టూ బురద.. కాలు చేయి ఆడించే అవకాశం కూడా లేదు. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. కనీసం ఆపద అని చెప్పే అవకాశం కూడా లేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 60 గంటలు.. నేపాల్ దేశంలో ఇటీవల భీకరంగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదల్లో నేపాల్ దేశంలో చాలావరకు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విపరీతంగా నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద నగరాల నుంచి మొదలు పెడితే […]

Nepal Floods: చుట్టూ బురద.. కాలు చేయి ఆడించే అవకాశం కూడా లేదు. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. కనీసం ఆపద అని చెప్పే అవకాశం కూడా లేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 60 గంటలు..

నేపాల్ దేశంలో ఇటీవల భీకరంగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వరదల్లో నేపాల్ దేశంలో చాలావరకు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విపరీతంగా నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద నగరాల నుంచి మొదలు పెడితే గ్రామాల వరకు విపరీతంగా నష్టం వాటిల్లింది. పెద్దపెద్ద భవనాలు కూలిపోయాయి. చిన్న చిన్న గృహాలు నామరూపాలు లేకుండా పోయాయి. బురద విపరీతంగా పేరుకుపోయింది.

ఆస్తి నష్టం.. ప్రాణనష్టం విపరీతంగా చోటుచేసుకుంది. నేపాల్ దేశ అధికారుల వివరాల ప్రకారం ఇప్పటివరకు 109 మంది చనిపోయినట్టు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. విపరీతమైన వరదల వల్ల రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. చెట్లు కూలిపోయాయి. ఇక గృహాలైతే పేక మేడల మాదిరిగా నేలమట్టమయ్యాయి.

బురదలో కూరుకుపోయి చాలామంది చనిపోయారు. అయితే అందులో ఒక బాలిక మాత్రం ఏకంగా 60 గంటల పాటు మృత్యుతో పోరాటం చేసింది. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి బురదలో కూరుకుపోయిన స్థితిలో ఆ బాలిక కనిపించింది. ఆ చిన్నారి వయసు ఆ సంవత్సరాలు. బురదలో ఆ బాలిక దాదాపు 60 గంటల పాటు కూరుకు పోయింది. వెంటనే సిబ్బంది ఆ బురద నుంచి ఆమెను బయటకు లాగారు. అయితే బురద లో కూరుకుపోయిన ఆ బాలిక చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో సిబ్బంది ఆమెను గుర్తించారు. బురద నుంచి ఆమెను బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత.. ఆమెను మెరుగైన చికిత్స కోసం నేపాల్ రాజధాని ఖాట్మండు తరలించారు. రసూవ ప్రాంతంలో భద్రత సిబ్బంది సహయక చర్యలు చేపడుతుండగా ఆ బాలిక కనిపించింది. దాదాపు 60 గంటల పాటు ఆ బాలిక బురదలో అలా ఉంది అంటే మాటలు కాదు. అయితే బాలికను ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత.. అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు.. నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper