Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ ని అత్యంత దారుణంగా అవమానించిన సుధీర్.. ఒక్కడిని చేసి...

Bigg Boss 10 Telugu: రోహిత్ ని అత్యంత దారుణంగా అవమానించిన సుధీర్.. ఒక్కడిని చేసి ఆడుకుంటున్న సెలబ్రిటీస్!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతన్ని టార్గెట్ చేసే విధానం చూస్తే రెండవ సీజన్ టైటిల్ విన్నర్ కౌశల్ గుర్తుకు వస్తున్నాడు. అప్పట్లో కౌశల్ ని కూడా ఇదే తరహా లో టార్గెట్ చేసేవారు. వాటి అన్నిటిని తట్టుకొని గేమ్ అద్భుతంగా ఆడి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఆ సీజన్ లో […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతన్ని టార్గెట్ చేసే విధానం చూస్తే రెండవ సీజన్ టైటిల్ విన్నర్ కౌశల్ గుర్తుకు వస్తున్నాడు. అప్పట్లో కౌశల్ ని కూడా ఇదే తరహా లో టార్గెట్ చేసేవారు. వాటి అన్నిటిని తట్టుకొని గేమ్ అద్భుతంగా ఆడి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఆ సీజన్ లో కౌశల్ ని కేవలం తన తోటి కంటెస్టెంట్స్ మాత్రమే టార్గెట్ చేసేవారు. కానీ ఈ సీజన్ లో ఏకంగా హోస్ట్ నాగార్జున కూడా వీకెండ్ లో రోహిత్ ని టార్గెట్ చేస్తున్నాడు.

వీకెండ్ అయితే నాగార్జున , మామూలు రోజుల్లో సెలబ్రిటీస్ నాన్ స్టాప్ గా టార్గెట్ చేస్తూ రోహిత్ ని అవమానిస్తూనే ఉన్నారు. మొన్నటి వారం వరకు త్రిగున్ అవమానించేవాడు , ఇప్పుడు కొత్తగా సుధీర్ తయారయ్యాడు. రెండు వారాలు నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడం , ఇతన్ని టార్గెట్ చేసిన శ్రేష్టి ఎలిమినేట్ అవ్వడం తో , సుధీర్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందని అంటున్నారు నెటిజెన్స్. నామినేషన్స్ లో పాయింట్స్ మాట్లాడకుండా , రోహిత్ ని వెక్కిరించడం పైనే సుధీర్ ఎక్కువగా ఫోకస్ చేశాడు. దానికి త్రిగున్ , వర్షిణి , దేబ్జాని, ముకేశ్ వంటి సెలబ్రిటీలు ఎగతాళి చేస్తూ నవ్వుతూ చప్పట్లు కొట్టడం చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు గా అనిపించింది.

ఇలాంటి ప్రవర్తన ఉన్న వీళ్ళు , అసలు సెలబ్రిటీలు ఎలా అయ్యారో అర్థం కావడం లేదని అంటున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా త్రిగున్ , దేబ్జాని అయితే రోహిత్ ని మాక్ చేస్తూ అనరాని మాటలు అన్నారు. దేబ్జాని కి అయితే తనకు సంబంధం లేకపోయినప్పటికీ రోహిత్ ని నువ్వొక కమెడియన్ అంటూ మాట్లాడింది. ఇక సుధీర్ అయితే బిగ్ బాసే నేరుగా డోర్స్ తెరిచి గెటౌట్ అన్నాడని , మితిలేష్ కి డోర్లు తెరిచినప్పుడు కనీసం చేతిలో 15 లక్షలు పెట్టి పంపించారని , నీకు అది కూడా ఇవ్వలేదని సుధీర్ రోహిత్ ని ఒక రేంజ్ లో వెక్కిరించాడు. ఇంట్లో పనులు చెయ్యలేవు, గేమ్స్ ఆడలేవు , నువ్వొక వేస్ట్ అంటూ రోహిత్ పై మండిపడ్డాడు సుధీర్. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆడపిల్ల ని తన గేమ్ కోసం ఉపయోగించుకున్న ఇతనే మాట్లాడాలి ఇలాంటివి అంటూ సుధీర్ ని ఏకిపారేస్తున్నారు నెటిజెన్స్. ఈ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కానుంది. టెలికాస్ట్ తర్వాత సుధీర్ గ్రాఫ్ పాతాళం లోకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper