Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: ముకేశ్ కి పట్టపగలే చుక్కలు చూపించిన చరణ్.. ఇది కదా...

Bigg Boss 10 Telugu: ముకేశ్ కి పట్టపగలే చుక్కలు చూపించిన చరణ్.. ఇది కదా మాస్ అంటే!

Bigg Boss 10 Telugu:  ‘అగ్ని పరీక్ష 2’ నుండి భారీ అంచనాలతో ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ చరణ్. ఇతను ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ సమయం లో అందరినీ ఆశ్చర్యపరిచాడు కానీ , ఆ తర్వాత అదే షో లో టాస్కుల్లో కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. జడ్జీల అంచనాలతో పాటు , ఆడియన్స్ అంచనాలను అందుకోవడం లో ఈయన తీవ్రంగా విఫలం అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి […]

Bigg Boss 10 Telugu:  ‘అగ్ని పరీక్ష 2’ నుండి భారీ అంచనాలతో ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ చరణ్. ఇతను ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ సమయం లో అందరినీ ఆశ్చర్యపరిచాడు కానీ , ఆ తర్వాత అదే షో లో టాస్కుల్లో కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. జడ్జీల అంచనాలతో పాటు , ఆడియన్స్ అంచనాలను అందుకోవడం లో ఈయన తీవ్రంగా విఫలం అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా తన చూపిస్తాడేమో ఇతన్ని సపోర్ట్ చేసే ప్రేక్షకులు భావించారు, కానీ అది కూడా జరగలేదు. మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లిన ఈయన , రెండవ వారం ఆడియన్స్ ఓట్లతో మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అయితే రెండవసారి అవకాశం వచ్చినా చరణ్ ఏమి చెయ్యడం లేదు , అవకాశం వృధా అయ్యిందని అంతా అనుకున్నారు. నాగార్జున కూడా వీకెండ్స్ లో చరణ్ పెర్ఫార్మన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చాడు. కానీ చరణ్ లో మంచి పొటెన్షియల్ ఉంది , ఎదో ఒక రోజు అది బయటపడుద్ది అని ఆడియన్స్ బలంగా నమ్ముతూ వచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ నేటి ఎపిసోడ్ లో చరణ్ తన మాస్ విశ్వరూపం చూపించాడు అనే చెప్పాలి. నామినేషన్స్ లో చాలా స్మూత్ గా ముకేశ్ పై గన్ షాట్ లాంటి పాయింట్స్ ని పెట్టి , అతని నోటి నుండి ఒక్క మాట కూడా రానివ్వకుండా చేసాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ముకేశ్ కి పట్టపగలే చుక్కలు చూపించాడు అనొచ్చు. ఈ నామినేషన్స్ ప్రక్రియ కి సంబంధించిన ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు , నిన్న లైవ్ లో జరిగింది , నేటి ఎపిసోడ్ లో ఈ ప్రక్రియ ని చూడొచ్చు.

ఈ ఎపిసోడ్ తర్వాత చరణ్ గ్రాఫ్ కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే వారం లో ‘రోడ్ టు రీలోడ్’ పేరిట టాస్కులు జరగనున్నాయి. ఈ టాస్కులు చాలా కఠినంగా ఉంటాయట. ఈ టాస్కుల్లో చరణ్ కనీసం ఒకటి , లేదా రెండు గెలిస్తే ఆయన గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఈ టాస్కుల్లో కూడా సత్తా చాటలేకపోతే , ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు , ఇతని గ్రాఫ్ గత వారం మాదిరిగానే ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన చరణ్ , ప్రస్తుతానికి డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఈ డేంజర్ జోన్ నుండి ఆయన బయటపడుతాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper