Actor Naslen: నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోలు , స్టార్ హీరోలతో సమానమైన వసూళ్లను రాబడుతూ యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ ఉన్నారు. అలాంటి యంగ్ హీరోల్లో ఒకరు నస్లేన్. ‘ప్రేమలు’ వంటి యూత్ ఫుల్ మూవీ తో మలయాళం , తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో నస్లేన్ ఇప్పుడు సీరియల్ కిల్లర్ గా మారిపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అయితే ఇది నిజ జీవితం లో కాదు లేండి , సినిమాలో. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్య హీరో గా తెరకెక్కున్తున్న లేటెస్ట్ చిత్రం ‘సీన్’ లో నస్లేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మలయాళం లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమాలో నస్లేన్ ఒక సీరియల్ సైకో కిల్లర్ గా కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ లో మాత్రమే కనిపించిన నస్లేన్ , ఇప్పుడు ఇంతటి వయొలెంట్ నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. టీజర్ లో కూడా నస్లేన్ పాత్రకు సంబంధించి కొన్ని క్లూలు ఇచ్చాడు డైరెక్టర్. మరి ఆడియన్స్ ఆయన్ని ఆ పాత్రలో చూడగలరా ?, నటుడు అన్న తర్వాత అన్ని పాత్రలు వెయ్యాలి , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ నస్లేన్ లో ఏ యాంగిల్ లో కూడా విలన్ లక్షణాలు కనిపించవు , అతన్ని చూసినప్పుడల్లా అమాయకత్వమే గుర్తుకు వస్తాది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి చేత విలనిజాన్ని పలికిస్తే డైరెక్టర్ కి సెల్యూట్ చేయొచ్చు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.
ఈ ఏడాది సూర్య హీరో గా నటించిన ‘కరుప్పు’, ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అలాంటి హిట్స్ తర్వాత ఆయన నుండి వెంటనే రాబోతున్న మూడవ సినిమా కావడం తో మార్కెట్ లో ఈ చిత్రం పై క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఏర్పడింది. మరి ఆ రేంజ్ కి సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్.