Botsa Satyanarayana: వరదలతో నేపాల్ దేశం అతలాకుతలం అవుతోంది. చాలావరకు జిల్లాలలో నష్టం విపరీతంగా ఉంది. ఇప్పటివరకు అందిన నివేదిక ప్రకారం దాదాపు 903 మంది వరదల వల్ల చనిపోయినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారి గురించి అక్కడ అధికారులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. నేపాల్ అధికారులు మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు సంబంధించిన సిబ్బంది కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నారు.
నేపాల్ దేశంలో ప్రధానంగా ఆస్తి నష్టం.. ప్రాణం నష్టం విపరీతంగా చోటుచేసుకున్నాయి. అసలే ఆదేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం. ఇప్పుడు ఈ వరదలు రావడంతో ఆ దేశ పాలకులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఓ నివేదిక ప్రకారం నేపాల్ దేశాన్ని ఇప్పుడు బాగు చేయాలంటే వందల కోట్లు అవసరమవుతాయని సమాచారం. ఇది ఆ దేశ మూలధనంలో 10 శాతం అని తెలుస్తోంది. వాస్తవానికి ఇంతటి ఆర్థిక భారాన్ని ఆ దేశం మోయగలుగుతుందా.. లేక ప్రపంచ దేశాల నుంచి అప్పులు ఏమైనా తీసుకుంటుందా అనేది చూడాలి.
నేపాల్ దేశంలో వరదలు వచ్చిన ప్రాంతంలో ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం తీవ్రంగా చోటు చేసుకున్నాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూడా అదే స్థాయిలో కొట్టుకుపోయాయి. ఇప్పట్లో అవి బాగు చేయాలంటే సాధ్యం కాదని.. చాలా సంవత్సరాల సమయం పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వరదరావడం వల్ల ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. మునుపటి ఆకృతి రావాలి అంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందని వారు వ్యాఖ్యానించారు.
వరదల వల్ల ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం మాత్రమే కాకుండా.. ప్రభుత్వపరంగా బ్యాంకులకు కూడా కోలుకోలేని నష్టం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో డబ్బు.. బంగారం కొట్టుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.. ప్రధానంగా త్రిశూరి పట్టణంలో నేపాల్ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ గురించి భారీగా నగదు.. బంగారం కొట్టుకుపోయాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్న సిబ్బంది దాదాపు 8 గంటలపాటు కష్టపడి బ్యాంకులో నుంచి బయటపడిన బంగారం.. నగదును వెలికి తీయగలిగారు. ఆ బంగారం విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుందని.. 1.5 కోట్ల నేపాలి కరెన్సీని సిబ్బంది తీసుకురాగలిగారని వార్తలు వస్తున్నాయి.
వరదల వల్ల కొట్టుకు వచ్చిన మృతదేహాల మీద ఉన్న బంగారాన్ని కొంతమంది తస్కరించడం ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ఈ విషయం మీద తీవ్రంగా దృష్టి సారించడంతో.. బంగారాన్ని దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక చనిపోయిన వారి అంత్యక్రియలు మైదాన ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. పట్టుకొచ్చిన మృత దేహాలను అధికారులు గుర్తించే పనిలోపడ్డారు. చనిపోయిన వారికోసం ఎవరూ రాకపోతే దహన కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వస్తే వారి చితాభస్మాన్ని అందిస్తున్నారు. నేపాల్ లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా పూర్తిస్థాయిలో నేపాల్ కోలుకోవాలి అంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.