Homeక్రీడలుRishabh Pant Wicketkeeping : అంత దెబ్బలోనూ రిషబ్ పంత్ వికెట్ల వెనుకాల ఉంటే మామూలుగా...

Rishabh Pant Wicketkeeping : అంత దెబ్బలోనూ రిషబ్ పంత్ వికెట్ల వెనుకాల ఉంటే మామూలుగా ఉండదు మరీ

Rishabh Pant Wicketkeeping : టీమిండియాలో వికెట్ల వెనుక ఉండి అద్భుతాలు చేస్తే మాంత్రికుడిగా ధోనికి పేరు ఉండేది. రెప్పపాటు కాలంలో వికెట్లను పడగొట్టి.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు దిమ్మ తిరిగే విధంగా షాక్ ఇచ్చేవాడు ధోని. కొన్ని సందర్భాలలో టీమిండియా కు వ్యతిరేకమైన ఫలితం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ధోని చాకచక్యం వల్ల ఆ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా మారేది. వికెట్ల వెనకాల ఉండి వ్యూహాలు రచించడంలో.. బౌలర్లకు వాటిని అర్థమయ్యే విధంగా ధోని […]

Rishabh Pant Wicketkeeping : టీమిండియాలో వికెట్ల వెనుక ఉండి అద్భుతాలు చేస్తే మాంత్రికుడిగా ధోనికి పేరు ఉండేది. రెప్పపాటు కాలంలో వికెట్లను పడగొట్టి.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు దిమ్మ తిరిగే విధంగా షాక్ ఇచ్చేవాడు ధోని. కొన్ని సందర్భాలలో టీమిండియా కు వ్యతిరేకమైన ఫలితం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ధోని చాకచక్యం వల్ల ఆ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా మారేది.

వికెట్ల వెనకాల ఉండి వ్యూహాలు రచించడంలో.. బౌలర్లకు వాటిని అర్థమయ్యే విధంగా ధోని చెప్పేవాడు. అందువల్లే అతడు టీం ఇండియాకు విజయవంతమైన సారధిగా.. సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ గా పేరు గడించాడు. ఇప్పుడు రిషబ్ పంత్ కూడా ధోని అడుగుజాడల్లో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మాట్ లో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్లో పంత్ వికెట్ల వెనకాల ఉండి మాయాజాలం సృష్టిస్తున్నాడు. తన దేహానికి గాయమైనప్పటికీ .. ఆ గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ పంత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా తన స్థాయిని నిరూపించుకుంటూ సత్తా చూపిస్తున్నాడు.

శ్రీలంక జట్టుతో కొలంబ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పంత్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో సంచలనం సృష్టించాడు. రెండవ టెస్టులో శ్రీలంక రెండవ ఇన్నింగ్స్ (ఫాలో ఆన్) ఆడుతున్న క్రమంలో.. లంక ఆటగాడు పసింధు సూర్య బండార (92) సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలో మానవ్ సుతార్ తో రిషబ్ పంత్ అద్భుతమైన ప్రణాళిక రూపొందించాడు. దానిని ఎగ్జిక్యూట్ చేశాడు. ఊరించే బంతిని వేయమని చెప్పాడు. దానికి సుతార్ కూడా అదే విధంగా చేశాడు. కాకపోతే ఆ బంతి బ్యాట్ కు దూరంగా వెళ్ళింది. అదే సమయంలో పంత్ వేగంగా ఆ బంతిని అందుకున్నాడు. వికెట్లను రెప్పపాటు కాలంలో పడగొట్టాడు. అప్పటిదాకా కాస్త టీమిండియా బౌలర్లను నిలువరించగలిగిన శ్రీలంక.. ఆ తర్వాత తడబాటుకు గురైంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ నుంచి శ్రీలంక గట్టెక్కే పరిస్థితి లేదు.

గతంలో ధోని కూడా ఇలానే వికెట్ల వెనకాల ఉండి ప్రయోగాలు చేసేవాడు. బౌలర్లతో వాటిని అమలు చేయించేవాడు. ఇప్పుడు పంత్ కూడా అలానే చేస్తున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మేట్లో ఒకప్పటి ధోనిని అతడు గుర్తుకు తెస్తున్నాడు. తద్వారా జట్టుకు అవసరమైన సందర్భంలో వికెట్లను పడగొట్టి.. బ్రేక్ త్రూ అందిస్తున్నాడు. పంత్ కు గాయమైనప్పటికీ.. గాయాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా తన దూకుడును కొనసాగిస్తూ సత్తా చూపిస్తున్నాడు. సూర్య బండార విషయంలో పంత్ ప్రణాళిక నూటికి నూరు శాతం విజయవంతం కావడంతో అతని మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper