Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో జరిగే సంఘటనలు రోజు రోజుకి హద్దులు దాటుతున్నాయి. వాటిని సోషల్ మీడియా కొన్ని పీఆర్ టీమ్స్ మసాలా జోడించి , లేని విషయాలను ఉన్నట్టుగా చూపించి ప్రేక్షకుల మైండ్ తో ఆడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముకేశ్ , వర్షిణి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు వీళ్లది కేవలం స్నేహం మాత్రమే అనుకున్నారు, కానీ ఎప్పుడైతే వర్షిణి కెప్టెన్ అవ్వగానే ముకేశ్ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుందో అప్పటి నుండి వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే విషయాన్నీ ఖరారు చేసుకున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే గత వారం కెప్టెన్ గా వ్యవహరించిన అపూర్వ , తన రూమ్ ని సరిగా వాడని కారణంగా నాగార్జున చేత డిజాస్టర్ కెప్టెన్ అని అనిపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ముకేశ్ ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ నిన్నటి నామినేషన్స్ లో కూడా తప్పుబట్టారు. అయితే నిన్న సోషల్ మీడియా లో ముకేశ్ కెప్టెన్ రూమ్ లో పడుకొని నిద్రలేచిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ వర్షిణి , ఆమె కదా అక్కడ పడుకోవాలి ?, ముకేశ్ పడుకోవడం ఏంటి?, ఇద్దరు కలిసి పడుకున్నారా ? వంటి కామెంట్స్ సోషల్ మీడియా లో వినిపించాయి. కానీ నిన్నటి ఎపిసోడ్ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. వర్షిణి కి ఒంటరిగా కెప్టెన్ రూమ్ లో పడుకోవడానికి భయమైంది. ఝాన్సీ , దేబ్జాని వంటి వారిని పిలిచి తనకు తోడుగా పడుకోబెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు అప్పటికే నిద్రపోయారు. దీంతో ముకేశ్ ని కెప్టెన్ రూమ్ లో పడుకోమని , తాను అందరితో పాటు పడుకుంటానని చెప్తుంది వర్షిణి. జరిగింది ఇది.. దీన్ని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే ఇలా కెప్టెన్ రూమ్ ని తమకు ఇష్టమొచ్చిన వాళ్లకు ఇవ్వడం రూల్స్ కి విరుద్ధం కదా?, అపూర్వ కి నాగార్జున ఆ రేంజ్ లో కోటింగ్ ఇవ్వడానికి గల కారణం అదే కదా?, మరి ఈ వీకెండ్ వర్షిణి కి కూడా అదే రేంజ్ కోటింగ్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదంతా పక్కన పెడితే , సోషల్ మీడియా లో ట్రోల్ చేసే వాళ్ళు ఒక పరిధి ని పెట్టుకుంటే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఒకే రూమ్ లో పెళ్లి అవ్వని ఒక అబ్బాయి , అమ్మాయి పడుకున్నారు అంటూ ప్రచారం చేయడం అత్యంత నీచమైన చర్య. ముందు వెనుక ఆలోచించకుండా, నోటికి ఎదోస్తే అది మాట్లాడడం ఎందుకు అంటూ విరుచుకుపడుతున్నారు విశ్లేషకులు. వర్షిణి , ముకేశ్ రిలేషన్ నచ్చకపోతే విమర్శించడం లో తప్పు లేదు కానీ , ఇలా జరగనివి జరిగినట్టు చూపించి పరువుకు భంగం కలిగించడం చట్ట రీత్యా నేరం. ఒరిజినల్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
E video chusi matladandi ra erri gorrellara..
Em telikunda kavalani negative chesevaallaki.. e video muddalo dhiguddi#BiggBossTelugu10
#Mukesh https://t.co/FzQ6OGTGCU— Bhargav (@Bhargav01690773) October 5, 2026