Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'వైల్డ్ కార్డు' గా 'బిగ్ బాస్ 10' లోకి రానున్న...

Bigg Boss 10 Telugu: ‘వైల్డ్ కార్డు’ గా ‘బిగ్ బాస్ 10’ లోకి రానున్న నూకరాజు.. రామ్ ప్రసాద్ ని మించిన రెమ్యూనరేషన్!

Bigg Boss 10 Telugu: నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘బిగ్ బాస్ 10’ అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వీకెండ్ ఈ వీకెండ్ బిగ్ బాస్ 10 లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. అది 8 మంది వస్తారా?, లేదా 6 మంది వస్తారా అనేది త్వరలోనే తెలియనుంది. అయితే ఇప్పటికే నూకరాజు పేరు ఖరారు అయ్యింది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న నూకరాజు , ఈమధ్య […]

Bigg Boss 10 Telugu: నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ‘బిగ్ బాస్ 10’ అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వీకెండ్ ఈ వీకెండ్ బిగ్ బాస్ 10 లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. అది 8 మంది వస్తారా?, లేదా 6 మంది వస్తారా అనేది త్వరలోనే తెలియనుంది. అయితే ఇప్పటికే నూకరాజు పేరు ఖరారు అయ్యింది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న నూకరాజు , ఈమధ్య కాలం లోనే స్టార్ మా లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ , ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ వంటి షోస్ తో అలరించిన నూకరాజు, ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ లో వైల్డ్ కార్డు గా రాబోతున్నాడు. పైన చెప్పిన రెండు షోస్ లోనూ నూకరాజు ఆడియన్స్ కి తెగ నచ్చేసాడు.

ముఖ్యంగా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో లో నూకరాజు ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాకుండా, టాస్కులు కూడా అద్భుతంగా ఆది గెలిచేవాడు. అందుకే ఆ సీజన్ రన్నర్ గా నిల్చి , తన మార్కు క్రియేట్ చేసుకున్నాడు. ఇక గొడవల్లో కూడా ఈయన తక్కువేం కాదు , తనకు తప్పు అనిపిస్తే చాలా గట్టిగా మాట్లాడడం ఇతని నైజం. గత సీజన్ లో ఇమ్మానుయేల్ ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఇమ్మానుయేల్ లాంటి కంటెస్టెంట్ ని అందుకోవడం భవిష్యత్తు సీజన్స్ లో కూడా కష్టమే అనుకున్నారు. కానీ నూకరాజు కి ఇమ్మానుయేల్ నే డామినేట్ చేసేంత సత్తా ఉంది. హౌస్ లో ఆటో రామ్ ప్రసాద్ , నరేష్ వంటి పాపులర్ కమెడియన్స్ ఉన్నప్పటికీ , కామెడీ ఆశించిన స్థాయిలో జెనెరేట్ అవ్వడం లేదు.

నూకరాజు ఎంట్రీ తో ఎంటర్టైన్మెంట్ లో గొప్ప మార్పు ని ఈ సీజన్ లో గమనించవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇతనిపై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉండడం రామ్ ప్రసాద్ ని మించిన రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. రామ్ ప్రసాద్ కి వారానికి 4 లక్షల 80 వేల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్. ఆయనకు మించిన రెమ్యూనరేషన్ అంటే 5 లక్షల పైమాటే. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ నిజంగా నూకరాజు కి ఇస్తున్నారా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper