Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: ఇంత ఖర్చా.. కక్క లేక మింగలేక ఆ వైసీపీ నేత పరిస్థితి

YSRCP: ఇంత ఖర్చా.. కక్క లేక మింగలేక ఆ వైసీపీ నేత పరిస్థితి

YSRCP: బాబోయ్ ఇంత ఖర్చా.. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలేదు. ఏదో నేను చెప్పిన వ్యక్తికి కీలకమైన పోస్ట్ ఇచ్చారు. రెండు మూడు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు అంతకుమించి ఖర్చు పెట్టిస్తున్నారు. అసలు నాకు ఎందుకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారు.. దీనివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలా అయితే కష్టం.. […]

YSRCP: బాబోయ్ ఇంత ఖర్చా.. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలేదు. ఏదో నేను చెప్పిన వ్యక్తికి కీలకమైన పోస్ట్ ఇచ్చారు. రెండు మూడు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు అంతకుమించి ఖర్చు పెట్టిస్తున్నారు. అసలు నాకు ఎందుకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారు.. దీనివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలా అయితే కష్టం.. ఈ పదవి వద్దు.. నాకు ఈ ఖర్చు వద్దు. హాయిగా భార్య పిల్లలతో సంసారం సాగిస్తాను.. ఇది ఆ వైసీపీ నాయకుడు తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చుతున్న ఆందోళన.

వాస్తవానికి ఆయన బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తండ్రి గతంలో మంత్రిగా పని చేశారు. తండ్రి చనిపోవడంతో వారసత్వంగా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో చేద్దామని.. తండ్రి లాగా ఎమ్మెల్యే అయ్యి.. మంత్రి అయ్యి.. తండ్రికి మించిన స్థాయిలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని అనుకున్నారు. కానీ అది అంత ఈజీ కాలేదు. ఎందుకంటే ఆయన తండ్రి వారసత్వం జస్ట్ వైల్డ్ కార్డు లాగానే ఉపయోగపడింది. ఆయనను అది ఎమ్మెల్యే చేయలేకపోయింది. నాటి రోజుల్లో ఆయన భారీగానే ఖర్చుపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

తొలిసారిగా ఓడిపోవడంతో ఆ పార్టీతో లాభం లేదు అనుకొని బయటికి వచ్చేసారు. మరో పార్టీలో చేరారు. టికెట్ కోసం భారీగానే ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే సీన్. పైగా ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు కావడంతో ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే మారుమోగింది. చివరికి ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు ఓటమి ఎదురైంది. ఇక తట్టుకోలేక అధికారంలో ఉన్న పార్టీకి జంప్ అయ్యారు. అక్కడ రాజధానికి దగ్గర్లో ఉన్న ఓ ప్రాంతంలో చక్రం తిప్పారు. నగరపాలక సంస్థలో ఎన్నికల్లో తనకు నచ్చిన. వ్యక్తులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఆ తర్వాత నగరపాలక సంస్థ మీద తన అభ్యర్థిని కూర్చోబెట్టారు. కొన్ని రకాల కాంట్రాక్టులు చేశారు. తక్కువలో తక్కువ ఒక 100 వరకు వెనకేసుకున్నారు. ఆ తర్వాత అధికారం పోవడంతో ఆయనకు సినిమా కనిపిస్తోంది. పార్టీ అధినేత ఆయనకు ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ పదవిలో ఉన్న పాపానికి ఆ జిల్లా ఖర్చు మొత్తం తనే భరించాల్సి వస్తోంది. పైగా అధినేత ఏపీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం.. వెళ్తున్నప్పుడు కూడా అదే స్థాయిలో స్వాగతం పలకడం.. జనాలను సమీకరించడం.. మీడియాను మేనేజ్ చేయడం.. ఇవన్నీ కూడా ఆయనకు తలకు మించిన భారం లాగా మారిపోయాయి. ఇక ఈ ఖర్చు తన వల్ల కాదని ఆయన తన అంతరంగికుల వద్ద చెబుతున్నారు. అంతేకాదు తనకు పార్టీ వద్దని.. పదవి కూడా వద్దని తెగేసి చెబుతున్నారు. మరి దీనిపై ఆ పార్టీ అధినేత ఏమంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper