Nepal Flood Disaster: ఆకస్మికంగా వచ్చిన వరదలు నేపాల్ దేశాన్ని సర్వనాశనం చేశాయి. గ్రామాలకు గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకొని పోయాయి. ప్రముఖంగా కొండ ప్రాంతాల పక్కన ఉన్న గృహాలు అయితే మొత్తంగా కొట్టుకుపోయాయి. వందలాదిమంది ప్రజలు చనిపోయారు. వేలాదిమంది ఆశ్రయానికి కోల్పోయారు.
గృహాలు చాలావరకు కొట్టుకుపోగా.. ఉన్న గృహాల మీద బురద మేట వేసింది. ఆ బురదను తొలగించాలంటే చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ మరదలు వచ్చి నాలుగు రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ నేపాల్ దేశంలో జనజీవనం సాధారణస్థితికి రాలేదు. ఇప్పట్లో పరిస్థితి బాగుపడుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నేపాల్ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రపంచ దేశాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. నేపాల్ దేశంలో ఉంటున్న తమ వారిని వెంటనే తిరిగి వచ్చేయాలని వర్తమానాలు పంపాయి.. నేపాల్ ఎగువ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల వల్ల వరదనీరు విపరీతంగా వస్తోంది.. మొన్నటి లాగా మరోసారి వరద నీరు గనుక ముంచెత్తితే నేపాల్ దేశం మరింత మునిగిపోవడం ఖాయం.
ఆకస్మిక వర్గాల వల్ల నేపాల్ దేశంలో చాలావరకు జిల్లాలో సర్వనాశనమయ్యాయి. ఒక నివేదిక ప్రకారం ఆ జిల్లాలలో మరమ్మతులు.. ఇతర పనులు చేపట్టాలంటే దాదాపు నాలుగు నుంచి ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ స్వర్నిమ్ వాగ్లే కీలక వ్యాఖ్యలు చేశారు..”నేపాల్ దేశంలో చాలావరకు జిల్లాలు వరద నీరు వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బురద విపరీతంగా పేరుకుపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ జిల్లాలను బాగు చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దాదాపు నేపాల్ దేశంలో ఉన్న ఎకానమీలో 10% డబ్బు ఖర్చు పెడితేనే ఆ జిల్లాలు బాగుపడతాయి. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. అధికారులు పూర్తిస్థాయిలో అంచనా సిద్ధం చేస్తున్నారు. వరదల వల్ల వందల కిలోమీటర్ల రోడ్లు.. వంతెనలు.. హైడ్రో పవర్ స్టేషన్లు .. వేల గృహాలు నాశనమయ్యాయి. ఇవన్నీ బాగు కావాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని” వాగ్లే పేర్కొన్నారు.
ఊహించని విధంగా వరద నీరు రావడంతో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. అడుగుల ఎత్తులో బండరాళ్లు.. బురద కొట్టుకు రావడంతో చాలావరకు ప్రాంతాలు సర్వనాశనమయ్యాయి. భారీ ఎత్తులో నిర్మించిన వంతెనలు కూడా కూలిపోయాయి అంటే వరద నీరు ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నేపాల్ దేశంలో ఈ స్థాయిలో వరదలు గతంలో ఎన్నడూ రాలేదు. చివరికి ప్రధాన నష్టం కూడా ఈ స్థాయిలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఆ వరదలు మదిలో మెదిలితే చాలు నేపాల్ ప్రజలు వణికిపోతున్నారు. మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.