Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన...

Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్!

Allu Arjun: ‘రాకా’ మూవీ తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ వీడియో లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ల సంఖ్యలో రీల్స్ […]

Allu Arjun: ‘రాకా’ మూవీ తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ వీడియో లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ల సంఖ్యలో రీల్స్ పడ్డాయి. అంతటి హైప్ ని తెచ్చుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఆగిపోయిందంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందా?, ఈ కాంబినేషన్ లో ఇక సినిమా లేనట్టేనా అనే సందేహాలు సోషల్ మీడియా లో వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే ‘రాకా’ తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను తో గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. గత కొంత కాలం నుండి బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అనేక సార్లు ముంబై కి వెళ్లి అల్లు అర్జున్ కి స్టోరీ ని కూడా వినిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా కమిట్ అవ్వడం తో బోయపాటి ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి , బోయపాటి శ్రీను మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ఈ దసరా కి ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. అల్లు అర్జున్ తో సినిమా ఖరారు అవ్వడం తో , నిన్న బోయపాటి శ్రీను తిరుమల కి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకున్నాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ న్యారేట్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి నచ్చలేదట. సెకండ్ హాఫ్ లో మార్పులు చెయ్యమని అల్లు అర్జున్ సూచించాడని , దానికి తగ్గట్టుగా లోకేష్ కనకరాజ్ మార్పులు చేసి , ఆయనకు స్క్రిప్ట్ రీసెంట్ గానే వినిపించాడని , అయినప్పటికీ అల్లు అర్జున్ కి నచ్చలేదని , దానికంటే బోయపాటి శ్రీను తో సినిమా చాలా సేఫ్ అనిపించడంతో , అతనితో సినిమా చేయబోతున్నాడని టాక్. గతంలో బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసాడు. కానీ ఇప్పుడు బోయపాటి శ్రీను ఫార్మ్ లో లేడు , ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అలాంటి సమయం బోయపాటి తో అల్లు అర్జున్ సినిమా చేయడం సరైన నిర్ణయమేనా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper