Homeఅంతర్జాతీయంNepal House Survives Flood: నేపాల్ వరదలు.. ఆ ఒక్క ఇల్లు ఎలా నిలబడింది..

Nepal House Survives Flood: నేపాల్ వరదలు.. ఆ ఒక్క ఇల్లు ఎలా నిలబడింది..

Nepal House Survives Flood: టిబెట్ నుంచి కనివిని ఎరుగని వరద వచ్చింది. ఆ వరద ప్రవాహానికి పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. ఇక చిన్న చిన్న గృహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృక్షాలు.. వేళ్ళతో సహా లేచిపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్రకృతి సృష్టించిన విధ్వంసం వల్ల అక్కడ దారుణమైన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ దేశంలో వచ్చిన వరదలు ప్రకృతి విలయం ఎలా ఉంటుందో అందరికీ లైవ్ లో చూపించాయి. ఒకరకంగా యుగాంతం సినిమాను […]

Nepal House Survives Flood: టిబెట్ నుంచి కనివిని ఎరుగని వరద వచ్చింది. ఆ వరద ప్రవాహానికి పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. ఇక చిన్న చిన్న గృహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృక్షాలు.. వేళ్ళతో సహా లేచిపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్రకృతి సృష్టించిన విధ్వంసం వల్ల అక్కడ దారుణమైన పరిస్థితి ఏర్పడింది.

నేపాల్ దేశంలో వచ్చిన వరదలు ప్రకృతి విలయం ఎలా ఉంటుందో అందరికీ లైవ్ లో చూపించాయి. ఒకరకంగా యుగాంతం సినిమాను అందరికీ గుర్తు చేశాయి. వాస్తవానికి ఈ స్థాయిలో వరద వస్తుందని ఎవరు అంచనా వేయలేకపోయారు. నేపాల్ దేశంలో వరదలు కొత్తకాక పోయినప్పటికీ.. ఈ స్థాయిలో వరదలు రావడం మాత్రం ఆ దేశ ప్రజలు ఎప్పుడూ చూడలేదు.. వరదలతో పాటు బురద.. అతిపెద్ద బండరాళ్లు కొట్టుకు రావడంతో నష్టం విపరీతంగా ఉంది. చాలామంది ఇండ్లలో ఉన్నవాళ్లు అందులోనే జల సమాధి అయిపోయారు. వరదలను అంచనా వేసిన కొంతమంది సమీపంలో ఉన్న కొండల మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

వరదలు ఈ స్థాయిలో వచ్చినప్పటికీ నేపాల్ దేశంలో ఒక ఇల్లు మాత్రం గట్టిగా నిలబడింది. అంతస్థాయిలో వరద వచ్చినప్పటికీ ఆ ఇల్లు చెక్కుచెదరలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ ఆ ఇల్లు అలా ఎలా నిలబడింది.. విపరీతంగా వరద వచ్చినప్పటికీ కూలిపోకుండా ఎలా ఆగిపోయింది.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ ఇల్లు అలా నిలబడేందుకు ప్రధాన కారణం నిర్మించిన తీరు.. వాడిన ఇనుము.. నేల సామర్థ్యం.. అని విశ్లేషకులు చెబుతున్నారు.

“భారీ అంతస్తుల నిర్మాణాలు కూలిపోయాయి. విపరీతంగా నష్టం వాటిల్లింది. కానీ ఆ ఇంట్లో మాత్రం అటువంటిది ఏమీ జరగలేదు. ఇంట్లో వాళ్ళు అలానే చూస్తూ ఉండిపోయారు. వరద ప్రవాహానికి ఆ ఇల్లు స్థిరంగా నిలబడగలిగింది. నాణ్యమైన సిమెంట్.. అధిక సామర్థ్యం ఉన్న ఇనుము.. నేల స్వభావం వంటివి ఆ ఇంటిని కాపాడగలిగాయి.. ఇంటి నిర్మాణంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే ఎటువంటి విపత్తులు వచ్చినా సరే నిలబడగలుగుతుంది. ఇది కేవలం నేపాల్ దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణ. గృహాలను నాణ్యంగా నిర్మించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో.. ఇంటి నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఈ వీడియో నిరూపించిందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper