Homeఅంతర్జాతీయంNepal Flood Viral Video: నేపాల్ వరదలు.. బస్సు నుంచి దూకి.. కొండపైకి ఎక్కి ప్రాణాలు...

Nepal Flood Viral Video: నేపాల్ వరదలు.. బస్సు నుంచి దూకి.. కొండపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.. వైరల్ వీడియో

Nepal Flood Viral Video: ఇటీవల నేపాల్ దేశంలో భారీగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల మంది చనిపోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించడం లేదు. వారి జాడ కనుక్కోడానికి అనేక బృందాలు పనిచేస్తున్నాయి. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపాల్ దేశానికి ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ఆహార సామాగ్రి.. ఔషధాలు.. నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాయి. అయినప్పటికీ నేపాల్ దేశంలో పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. గ్రామాలకు గ్రామాలు […]

Nepal Flood Viral Video: ఇటీవల నేపాల్ దేశంలో భారీగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల మంది చనిపోయారు. వేలాదిమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించడం లేదు. వారి జాడ కనుక్కోడానికి అనేక బృందాలు పనిచేస్తున్నాయి.

వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపాల్ దేశానికి ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ఆహార సామాగ్రి.. ఔషధాలు.. నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాయి. అయినప్పటికీ నేపాల్ దేశంలో పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. గ్రామాలకు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పెద్ద పెద్ద పట్టణాలు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్దపెద్ద భవంతులు కుప్పకూలిపోయాయి. బురద అడుగుల మేర పేరుకుపోయింది. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకుండా పోయింది. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది.

నేపాల్ దేశంలో దర్శనీయ ప్రాంతాలు అధికంగా ఉంటాయి. పైగా ఇక్కడ హిమాలయాలు దగ్గరగా ఉండడంతో చాలామంది ఈ ప్రాంతాలను చూసేందుకు వస్తుంటారు. వరదలు సంభవించిన సమయంలో చాలామంది యాత్రికులు నేపాల్ దేశాన్ని సందర్శిస్తున్నారు. ఆ వరదల్లో చాలామంది కొట్టుకుపోయారు. ఇందులో భారత సంతతికి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే భారత సంతతికి చెందిన ఓ జంట మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కదులుతున్న బస్సు నుంచి దూకింది. అంతేకాదు అంతే ఎత్తున ఉన్న కొండమీదికి ఎక్కింది. ప్రాణాలు కాపాడుకోవాలని ఉద్దేశంతో 500 మెట్లను వారు అత్యంత సాహసంతో ఎక్కారు. ఫలితంగా ప్రాణాలు కాపాడుకున్నారు.

భారత సంతతికి చెందిన అంజన రాజా.. పట్టాభిరామన్ వెంకటేశన్ అనే దంపతులు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లారు. వీరు నేపాల్.. చైనా సరిహద్దుల్లో ప్రయాణిస్తున్నారు. నేపాల్ లోని రసూవ జిల్లాలోని తిమురే గ్రామం వద్ద వీరి టూరిస్ట్ బస్సు ఉంది. హిమాలయాల్లోని హిమాని నదం కరిగిపోయి ఒక్కసారిగా కొండలపై నుంచి సునామి తరహాలో బురద.. నీరు మిశ్రమం అంతా దూసుకు వచ్చింది. ఆ ప్రమాదాన్ని టూరిస్ట్ గైడ్ అంచనా వేశాడు. వెంటనే అందరిని అప్రమత్తం చేశాడు. దీంతో యాత్రికులు మొత్తం బస్సు నుంచి కిందికి దుకారు. ప్రాణాలను కాపాడుకోవడానికి వేగంగా సమీపంలో ఉన్న కొండమీదికి ఎక్కారు. క్షణకాలంలోనే 500 మెట్లు ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. భీకరమైన ఈ వరదలు అనేకమంది గల్లంతయ్యారు. అయితే ప్రాణాలతో బయటపడిన అతికొద్దిమందిలో ఈ అమెరికన్ జంట ఒకటనే అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనాలలో వెల్లడించాయి. ప్రస్తుతం ఆ జంట నేపాల్ రాజధాని కార్పెండ్ చేరుకొంది. తమ ఎదుర్కొన్న భయానక పరిస్థితులను ఆ జంట బయటపెట్టింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper