Nepal Floods: నిన్న మొన్నటిదాకా అది అతిపెద్ద భవనం. అక్కడ దాదాపు చాలా వరకు కుటుంబాలు నివాసం ఉండేవి. అ భవనం ఆ ప్రాంతానికి ఒక రాజమహల్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది.
నేపాల్ దేశంలో వచ్చిన అపారమైన వరద వల్ల విపరీతమైన విధ్వంసం జరిగింది. చాలావరకు గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. పట్టణాలు బురదలో కూరుకుపోయాయి. ఇప్పటికి వరదలు వచ్చి నాలుగు రోజులు పూర్తయినప్పటికీ నేపాల్ దేశం ఇంతవరకు కోలుకోలేదు. సహాయక చర్యలు చేపడుద్దామని రంగంలోకి దిగుతుంటే.. మళ్లీ వరదలు వస్తున్నాయి. టిబెట్ ప్రాంతంలో నీరు రంగు మారుతోందని.. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నేపాల్ దేశంలో సహాయక చర్యలను నిలుపుదల చేశారు.
నేపాల్ ఎగువ ప్రాంతంలో.. చైనా ఆక్రమించిన టిబెట్ లో వర్షపు నీటిని ఆపడం.. మంచుకొండ ఆ నీటిలో పడిపోవడంతో.. ఒకసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీంతో నేపాల్ దేశాన్ని వరద చుట్టుముట్టింది. వాస్తవానికి హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండే నేపాల్ దేశంలో వరదలు కొత్త కాకపోయినప్పటికీ.. ఈ స్థాయిలో వరదలు రావడం గతంలో ఎన్నడు చూడలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మూడంతస్తుల భవనాలను సైతం వరద నీరు ముంచెత్తింది అంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. సర్వం నష్టపోయామని.. చివరికి తమ నివాసం ఉంటున్న గృహాలను బురద చుట్టుముట్టిందని అక్కడి వారు చెబుతున్నారు.
నేపాల్ దేశంలో చైనా సరిహద్దుల్లో ఉండే ఓ ప్రాంతంలో అతిపెద్ద భవనం ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆ పెద్ద భవనంలో చాలామంది తలదాచుకుంటున్నారు.. వరదలు వచ్చి నాలుగు రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంతవరకు నీటి ప్రవాహం తగ్గలేదని.. కనీసం తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేవని.. బురదనం ఎత్తిపోయాలంటే చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అంత పెద్ద భవనం వంతెనలాగా మారిపోయి.. స్థానికులకు రాకపోకలకు అవకాశం కల్పిస్తోంది అంటే.. అక్కడ వంతనలు.. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేపాల్ దేశంలో పరిస్థితి కుదుట పడేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
View this post on Instagram