Homeఆంధ్రప్రదేశ్‌Kilari Rajesh: కిలారు రాజేష్.. నారా లోకేష్ కు ఆంజనేయుడి లాంటి స్నేహితుడు

Kilari Rajesh: కిలారు రాజేష్.. నారా లోకేష్ కు ఆంజనేయుడి లాంటి స్నేహితుడు

Kilari Rajesh: ఆయన నిశ్శబ్దంగా ఉంటారు. మైకుల హోరు దూరంగా ఉంటారు. కెమెరాల హడావిడికి కనిపించనంతగా ఉండిపోతారు. ఆయనను ఒక రకంగా ఐరన్ విల్ అనొచ్చు.. రాత్రింబవళ్లు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతారు. కంటికి కనిపించకుండా.. రెండవ చెవికి వినిపించకుండా పనిచేసే ఆ నిశ్శబ్ద సైనికుడు పేరు కిలారు రాజేష్. ఇతను మూడు అక్షరాల పదం కాదు. నారా లోకేష్ కు నమ్మిన బంటు. కుడి భుజం. సూదంటు రాయి లా పనిచేయగలిగే నేర్పు.. ఇవన్నీ రాజేష్ సొంతం. అందువల్లే […]

Kilari Rajesh: ఆయన నిశ్శబ్దంగా ఉంటారు. మైకుల హోరు దూరంగా ఉంటారు. కెమెరాల హడావిడికి కనిపించనంతగా ఉండిపోతారు. ఆయనను ఒక రకంగా ఐరన్ విల్ అనొచ్చు.. రాత్రింబవళ్లు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతారు.

కంటికి కనిపించకుండా.. రెండవ చెవికి వినిపించకుండా పనిచేసే ఆ నిశ్శబ్ద సైనికుడు పేరు కిలారు రాజేష్. ఇతను మూడు అక్షరాల పదం కాదు. నారా లోకేష్ కు నమ్మిన బంటు. కుడి భుజం. సూదంటు రాయి లా పనిచేయగలిగే నేర్పు.. ఇవన్నీ రాజేష్ సొంతం. అందువల్లే నారా లోకేష్ ఈయనను బాగా నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో నారా లోకేష్ తనని తాను కూడా నమ్మని పరిస్థితిలో.. కిలారు రాజేష్ మీదనే నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని రాజేష్ నిలబెట్టుకున్నారు. అందువల్లే ఈరోజు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ ను అన్ని వర్గాలకు దగ్గర చేయగలిగింది.

కిలారు రాజేష్.. నారా లోకేష్ మధ్య స్నేహం హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో మొదలైంది. వాస్తవానికి నాడు వారిద్దరి మధ్య మొగ్గ తొడిగిన స్నేహం నేడు ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చేసింది.. కిలారు రాజేష్ విజయవాడలోని ఓ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లో పుట్టారు. అమెరికాలోని రాబర్ట్ మోరిస్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.. కానీ నారా లోకేష్ ఒక్క మాట చెప్పగానే వెంటనే వచ్చేసారు. కష్టకాలంలో నారా లోకేష్ కు వెన్నంటి ఉన్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే నారా లోకేష్ కు అన్ని తానయ్యారు. నారా లోకేష్ పదవిలో ఉన్నప్పుడు చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు. అధికారం దూరమైన తర్వాత చాలామంది దూరమయ్యారు. కానీ అధికారం ఉన్నప్పుడు.. అధికారం లేనప్పుడు అంతే దగ్గరగా ఉన్నారు కిలారు రాజేష్. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నారా లోకేష్ 3132 కిలోమీటర్ల దూరం యువ గళం పాదయాత్ర ద్వారా నడిచారు. వందల రోజులు కుటుంబానికి దూరంగా ఉన్నారు. లక్షల మంది జనాన్ని కలిశారు. కానీ ఇన్ని రోజులు నారా లోకేష్ లక్షల అడుగుల వెనుక నడిచిన వ్యక్తి కిలారు రాజేష్. వాస్తవానికి ఆ పాదయాత్ర వెనుక ప్రతి వ్యూహాన్ని రచించింది రాజేష్. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కేసులు పెట్టారు. మైకులు లాక్కున్నారు. వాహనాలను కదలకుండా చేశారు. అనుమతులు కూడా ఇవ్వలేదు. రాత్రికి రాత్రే ప్రతి పరిణామం వ్యతిరేకంగా మారేది. ఒకరకంగా చెప్పాలంటే గొంతు నుంచి మాట రావాలంటే కూడా భయానకమైన పరిస్థితి. అటువంటి స్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటూ.. సమాచార వ్యవస్థలను కలుపుకుంటూ.. ప్లాన్ బి సిద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకరకంగా నారా లోకేష్ పాదయాత్ర మిలిటరీ ఆపరేషన్ లాగా ముందుకు సాగడ వెనుక కీలాలు రాజేష్ ఉన్నారు.

నారా లోకేష్ ఉదయం నుంచి రాత్రి దాకా పాదయాత్ర చేసేవారు. ఆ సమయంలో రాత్రిపూట ఆయన విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయంలో కిలారు రాజేష్ బృందం మేల్కొనేది. నారా లోకేష్ ను కంటికి రెప్పలాగా కాపాడుకునేది. మరుసటి రోజు రోడ్డు మ్యాప్.. రూట్ మ్యాప్.. కలవాల్సిన ప్రజలు.. స్థానిక నాయకులతో చేసుకోవాల్సిన సమన్వయం.. మిగతా ఏర్పాట్లు అన్ని ఆ రాత్రి జరిగేవి. ఉదయాన్నే సూర్యుడు పలకరించే లోపు ఇవన్నీ కూడా నారా లోకేష్ టేబుల్ ముందు ఉండేవి. ఎండలేదు. వాన లేదు. అలసట అసలే లేదు. రాజేష్ అనే మాట నారా లోకేష్ నోటి వెంట వచ్చేలోగానే కిలారు అలర్ట్ అయ్యారు..

పార్టీ అధినేతను అరెస్ట్ చేసిన రోజుల్లో.. ఆ ప్రభావం కిలారు రాజేష్ మీద కూడా పడింది. రాజేష్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కేసులు పెట్టారు. నోటీసులు అందించారు. గంటల తరబడి విచారణల పేరుతో ఇబ్బంది పెట్టారు.. హైదరాబాదులో ఆయన ఉండే ప్రాంతంలో ప్రతిరోజు గుర్తు తెలియని వ్యక్తులు కదిలేవారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో.. అన్ని రకాలుగా పెట్టారు.. కానీ అవన్నీ కూడా రాజేష్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టలేదు. చట్టాన్ని గౌరవించారు. విచారణను సామర్థవంతంగా ఎదుర్కొన్నాడు.. ఆ తర్వాత మళ్లీ పార్టీలో ప్రవేశించారు. కార్యకలాపాలను వేగంగా సాగించారు. అన్నిటికంటే ముఖ్యంగా 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన.. టిడిపి నాయకులను సమన్వయం చేసుకుంటూ రాజేష్ సాగించిన దౌత్యం మామూలుది కాదు. ప్రతి చిన్న అంశాన్ని పరిశీలించారు. ఒక నాయకుడు కూడా ఇబ్బంది పడకుండా చూసుకున్నారు. అందువల్లే ఓటు బ్యాంకు చెయ్యి జారిపోలేదు. ఫలితంగా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.

కిరారు రాజేష్ తనను నమ్మి వచ్చిన వారికి అన్యాయం చేయలేదు. తనకు సహాయం కావాలని వచ్చిన వారిని దూరం పెట్టలేదు. కాకపోతే ఆయనకు నిజాయితీ ఇష్టం. నిజాయితీగా ఉండి తన వద్దకు వచ్చే వాళ్లకు ఆయన ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంచుతారు.. ఇంత చేసినప్పటికీ పదవులు కోరుకోవడం లేదు. డబ్బును ఆశపడటం లేదు. హోదాను ఇష్టపడటం లేదు. నారా లోకేష్ కు అంతరంగికుడు అనే మాట చాలు అని అనుకుంటున్నారు. దీన్నిబట్టి రాజేష్ ఎలాంటి వాడి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కిలారు రాజేష్ పుట్టినరోజు. అయినప్పటికీ హంగు లేదు. ఆర్భాటం అంతకంటే లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper