Flipkart Big billion days: ప్లిఫ్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరి కొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. ఈసారి అమ్మకాలలో ముఖ్యంగా నాలుగు కంపెనీల ఫోన్ల మీద ప్లిఫ్ కార్ట్ బ్రహ్మాండమైన డిస్కౌంట్లు ప్రకటించింది. అంతేకాదు ప్రీమియం సెగ్మెంట్లో ఈ నాలుగు ఫోన్లు తోపు అని చెప్పవచ్చు. బిగ్ బిలియన్ డేస్ లో ఈసారి Samsung galaxy s26, Redmi note 17 Pro, oneplus N6 Lite, IQOO 16, iPhone 18 Pro వంటి మోడల్స్ మీద భారీగా డిస్కౌంట్ లో లభించే అవకాశం ఉంది.
Samsung galaxy s26
ఇందులో ప్రీమియం డిజైన్.. అత్యంత ఆధునాతనమైన కెమెరాలు.. శక్తివంతమైన ప్రాసెసర్.. అద్భుతమైన డిస్ ప్లే, సామ్ సంగ్ సాఫ్ట్వేర్, AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ లో బ్యాంక్ ఆఫర్లు.. ఇతర ఎక్సేంజ్ బోనస్ లు, డిస్కౌంట్ కలిపితే దీని ధర తగ్గే అవకాశం ఉంది.
Redmi note 17 Pro
మిడ్ రేంజ్ విభాగంలో అధికంగా పోటీ ఉన్న బ్రాండ్ ఇది. పెద్ద బ్యాటరీ.. అత్యధికమైన రీ ఫ్రెష్ రేట్, AMOLED display, అద్భుతమైన కెమెరా సెట్ అప్, వేగవంతమైన ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక అత్యుత్తమమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.
Oneplus N6 Lite
మిడ్ రేంజ్ విభాగంలో వన్ ప్లస్ ఫోన్ కు తిరుగులేని గిరాకీ ఉంటుంది. ఫాస్ట్ పర్ఫామెన్స్.. క్లీనర్ సాఫ్ట్వేర్ అనుభవం.. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే అంశాలు ఈ ఫోన్ కు ప్లస్ పాయింట్. గేమింగ్.. మల్టీ టాస్కింగ్ కు ప్రాధాన్యమిచ్చారు.
IQOO 16
గేమింగ్ కు ఈ మోడల్ లో ప్రాధాన్యమిచ్చారు. పెర్ఫార్మన్స్ విషయంలో కూడా ఈ ఫోన్ కు తిరుగులేదు. అత్యంత శక్తివంతమైన చిప్ సెట్ ఉంది.. అత్యధిక రీ ఫ్రెష్ రేట్ దీని సొంతం. మెరుగైన కూలింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటాయి.
iPhone 18 pro
ప్రీమియర్ సెగ్మెంట్లో ఇది మరో అత్యుత్తమమైన ఎంపిక. కెమెరా, వీడియో రికార్డింగ్, ప్రాసెసింగ్ పవర్, ఐ ఓ ఎస్ అనుభవం, ఆపిల్ ఎకో సిస్టం వంటి అంశాలు ఈ ఫోన్ కు ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల తో పోలిస్తే ఐఫోన్ 18 ప్రో ధర ఎక్కువగా ఉంటుంది.
ఎటువంటి ఫోన్ కొనాలంటే..
ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ దక్కించుకోవాలనుకుంటే.. గెలాక్సీ s26 సిరీస్, పెద్ద బ్యాటరీ.. రెడ్మీ నోట్ 17 ప్రో ద్వారా ఎక్కువ ఫీచర్లు.. వన్ ప్లస్ ఎన్ సిక్స్ లైట్ లేదా ఐక్యూOO 16 లో ఐ ఓ ఎస్, ఆపిల్ ఎక్కువ సిస్టం కోరుకునేవారు ఐఫోన్ 18 ప్రోవైపు చూసే అవకాశం ఉంది. అయితే బిగ్ బిలియన్ డేస్ లో అసలు ధరలు.. బ్యాంకుల ద్వారా లభించే డిస్కౌంట్ లు.. ఎక్స్చేంజ్ ఆఫర్లు బయటికి వచ్చిన తర్వాత.. ఈ ఫోన్లలో ఏది ఎంత కు లభిస్తుందో తెలుస్తుంది.