Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: జగన్ అస్త్రం.. ఉత్తరాంధ్రలో గేమ్ చేంజర్ కాబోతోందా.

YS Jagan: జగన్ అస్త్రం.. ఉత్తరాంధ్రలో గేమ్ చేంజర్ కాబోతోందా.

YS Jagan:ఉత్తరాంధ్ర రాజకీయాలలో వైసీపీ అధినేత జగన్ తీసుకుని నిర్ణయం సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికలకు ముందు ఇది ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఉత్తరాంధ్రలో ప్రముఖమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి బొత్స అనూషను వైసీపీ సమన్వయకర్తగా జగన్ నియమించారు. ఇది జగన్ చేపట్టిన కొత్త రాజకీయ ప్రయోగమా అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. వైసిపి చేసిన అధికారిక ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 18న జగన్ ఆదేశాలు జారీ చేయడంతో అనూష ఈ బాధ్యతలు స్వీకరించారు.. […]

YS Jagan:ఉత్తరాంధ్ర రాజకీయాలలో వైసీపీ అధినేత జగన్ తీసుకుని నిర్ణయం సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికలకు ముందు ఇది ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఉత్తరాంధ్రలో ప్రముఖమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి బొత్స అనూషను వైసీపీ సమన్వయకర్తగా జగన్ నియమించారు. ఇది జగన్ చేపట్టిన కొత్త రాజకీయ ప్రయోగమా అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

వైసిపి చేసిన అధికారిక ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 18న జగన్ ఆదేశాలు జారీ చేయడంతో అనూష ఈ బాధ్యతలు స్వీకరించారు.. భీమిలి నియోజకవర్గానికి గతంలో సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు ఉండేవారు. ఇటీవల ఆయన టిడిపిలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గంలో స్థానం ఖాళీ అయింది. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని బొత్స కుటుంబానికి చెందిన అనూషతో భర్తీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. భీమిలి ఎమ్మెల్యేగా ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఈయనకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. స్థానికంగా నెట్వర్క్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అనూషకు భీమిలి నియోజకవర్గంలో అంత ఈజీగా ఉండదు. వైసిపి మాత్రం కొత్త నాయకత్వంలో క్యాడర్ మొత్తాన్ని సమీకరించే విషయంలో దృష్టారించినట్టు ప్రకటించింది

మాజీ శ్రీనివాస్ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీ నిర్మాణం మీద ప్రత్యేకంగా అదృష్ట సారించారు. ఈనెల 16న ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితులను.. స్థానిక ఎన్నికలను చర్చించారు.. అయితే ఇక్కడ బలమైన నాయకుల మీద జగన్ ఆధారపడడంతో పాటు.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది జగన్ దృష్టిలో గేమ్ చేంజర్ అవుతుందా అని తేల్చడం ఒకరకంగా తొందరపాటు నిర్ణయం అవుతుంది. బొత్స సత్యనారాయణ కుమార్తెగా అనుషకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. కానీ భీమిలి నియోజకవర్గం లో ఆమెకు ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు.. కేడర్ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారు.. స్థానిక సమస్యల మీద ఎలా పోరాటం చేస్తారు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏ స్థాయిలో బలోపేతం చేస్తారు అనే అంశాల ఆధారంగా అనుష రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.

కాకపోతే ఇప్పటికైతే ఒక విషయం మాత్రం స్పష్టం. భీమిలితో జగన్ మొదలు పెట్టిన నాయకత్వ మార్పు ప్రయోగం.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపి పునర్వ్యవస్థీకరణలో భాగంగా మారుతుందా.. లేదా మరో రకమైన చర్చకు దారితీస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper