Homeఅంతర్జాతీయంIndia China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి...

India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన నిజం

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను ఆక్రమిస్తూ ఉంటుంది. మన దేశ సైనికుల మీద నిబంధనలు అతిక్రమించి దాడులకు ఉసిగొలుపుతూ ఉంటుంది.. అటువంటి చైనా ఒక్కసారిగా మన మాట విని తన ఆర్మీని వెనక్కి తీసుకుంది. చైనా దేశంలో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను అక్కడి ప్రభుత్వం తొలగించింది. దీని వెనక భౌగోళికమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. చైనా దేశంలో అత్యున్నత సైనిక కమాండ్ […]

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను ఆక్రమిస్తూ ఉంటుంది. మన దేశ సైనికుల మీద నిబంధనలు అతిక్రమించి దాడులకు ఉసిగొలుపుతూ ఉంటుంది.. అటువంటి చైనా ఒక్కసారిగా మన మాట విని తన ఆర్మీని వెనక్కి తీసుకుంది.

చైనా దేశంలో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను అక్కడి ప్రభుత్వం తొలగించింది. దీని వెనక భౌగోళికమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. చైనా దేశంలో అత్యున్నత సైనిక కమాండ్ బాడీ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ నుంచి గ్యాంగ్ యుగాజియా.. లియో జనీల్ అనే ఇద్దరు సీనియర్ జనరల్స్ ను తొలగించింది. చైనాలో కొంతమంది అవినీతిపరులైన అధికారులు అమెరికా ప్రేరేపిత కుట్రలో భాగంగా భారత్, చైనా, భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలను సృష్టించాలని ప్రయత్నించారు. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్ వంటి అంతర్జాతీయ సంక్షోభాల నుంచి ప్రపంచదృష్టిని మళ్లించడానికి ఈ ప్రయత్నం జరిగింది.. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన భారత్ వెంటనే అప్రమత్తమైంది.. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చైనాలో.. భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రష్యాలో పర్యటించారు. మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను పకడ్బందీ ఆధారాలతో ఆయా దేశాల నాయకత్వాలకు వివరించారు. దీనివల్ల చైనా వాస్తవ పరిస్థితి తెలుసుకుని.. సైనిక అధికారులను విధుల నుంచి తొలగించింది. చైనా అధ్యక్షుడు తన సొంత మార్గాల ద్వారా ఈ విషయాలను దృవీకరించుకున్నారు. ఆ తర్వాత ఆ అధికారులను తొలగించారు.. అంతేకాదు భారత సరిహద్దుల్లో మోహరించిన చైనా ఆర్మీని వెనక్కి పంపించారు.

కొద్దిరోజులుగా భారత సరిహద్దులో చైనా తన ఆర్మీని మోహరించింది. వారి కదలికలను పెంచింది. ఇది మన దేశ ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి గాల్వన్ లోయలో జరిగిన ఘటన తర్వాత భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నది. అలాగాని చైనాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు. అయితే చైనా గెలికి వాసన చూసే రకం. పైగా కొంతమంది అవినీతిపరులైన అధికారులు ఆ దేశ ఆర్మీలో ఉండడంతో.. భారతదేశాన్ని కవ్వించే విధంగా చేస్తున్నారు. ఇది మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని గుర్తించి లోతుగా తవ్వడం మొదలుపెట్టింది. దీని వెనక అమెరికా అమెరికా ఉన్నట్టు గుర్తించి.. ఈ విషయాలను చైనా.. ఇతర దేశాల దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో అమెరికా అసలు రంగు బయటపడింది. మరి దీనిపై అమెరికా ఏవిధంగా చర్యలు తీసుకుంటుంది.. అమెరికా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగిందా.. లేకుంటే ఎవరైనా అధికారుల అత్యుత్సాహం వల్ల జరిగిందా అనేది విచారణలో తేలుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చైనాతో జరగబోయే ముప్పును ముందుగానే ఊహించిన భారత్.. దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించింది. చివరికి అమెరికా కంటిని అమెరికా చేతితోనే పొడి పించింది. అంతేకాదు సరిహద్దుల్లో భారీగా మోహరించిన చైనా సైనికులను చైనా ప్రభుత్వమే వెనక్కి పంపించే విధంగా చేసింది. మొత్తానికి భారత్ తనకు ఎదురు కాబోతున్న ముప్పును అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper