Homeఅంతర్జాతీయంBRICS 2026 : చైనా, రష్యా అధ్యక్షుల భారత్‌ రాక.. అమెరికాలో వణుకు మొదలైంది..

BRICS 2026 : చైనా, రష్యా అధ్యక్షుల భారత్‌ రాక.. అమెరికాలో వణుకు మొదలైంది..

BRICS 2026 : భారత దేశంలో మరో అతిపెద్ద, ముఖ్యమైన సమావేశం జరుగనుంది. సెప్టెబర్‌ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సమావేశాన్ని అడ్డుకునేందుకు కూడా అమెరికా డీప్‌ స్టేట్‌ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో సదస్సును ఎలాగైనా విజయవంతం చేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చైనా పర్యటన, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. […]

BRICS 2026 : భారత దేశంలో మరో అతిపెద్ద, ముఖ్యమైన సమావేశం జరుగనుంది. సెప్టెబర్‌ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సమావేశాన్ని అడ్డుకునేందుకు కూడా అమెరికా డీప్‌ స్టేట్‌ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో సదస్సును ఎలాగైనా విజయవంతం చేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చైనా పర్యటన, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ రష్యా పర్యటన ఒకే సమయంలో పర్యటిస్తున్నారు. సరిహద్దు చర్చలు జరిపారు. అనంతరం నేపథ్యంలో దోవల్, చైనా విదేశీ మంత్రి వాంగ్‌ ఈ సమావేశాల్లో షీ జిన్‌పింగ్‌ను సెప్టెంబర్‌ 12, 13న ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ఆహ్వానించారు. జిన్‌పింగ్‌ కూడా సానుకూలంగా స్పందించి 400 మంది ప్రతినిధి మండలితో హాజరవుతానని తెలిపారు. అదే సమయంలో జైశంకర్‌ పుతిన్‌ను ఆహ్వానించగా, ఆయన కూడా పెద్ద ప్రతినిధి బృందంతో వస్తానని అంగీకరించారు. ఇది భారత్, చైనా, రష్యా అనే మూడు ప్రధాన శక్తులను ఒకే వేదికపై తీసుకురావడం ద్వారా భారత్‌ సాధించిన దౌత్య విజయం.

2019 తర్వాత మొదటిసారి..
2020లో గాల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌–చైనా సంబంధాలు ఉద్రిక్తతలతో నిండిపోయాయి. షీ జిన్‌పింగ్‌ 2019 తర్వాత భారత్‌కు రాలేదు. గతేడాది చైనాలోని టియాన్జిన్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌ ముగ్గురూ కలిశారు. ఈ ఫొటో అంతర్జాతీయ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఢిల్లీలో బ్రిక్స్‌ వేదికపై మళ్లీ కలవడం సంబంధాల రీసెట్‌కు మార్గం సుగమం చేస్తుంది. సరిహద్దు అంశాలపై ఒక అంగీకారానికి రావాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. బ్రిక్స్‌ సమావేశం తర్వాత ఉన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

వాణిజ్య సమతుల్యత వైపు..
భారత్‌–చైనా మధ్య వాణిజ్యం 151 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇందులో చైనా ఎక్కువ లాభం పొందుతోంది. భారత్‌ ఈ అసమతుల్యతను తగ్గించాలని చూస్తోంది. 2020లో సరిహద్దు దేశాలతో (చైనా సహా) వాణిజ్య ఒప్పందాలపై ఆంక్షలు విధించిన భారత్, ఇప్పుడు వాటిని సడలిస్తూ ట్రేడ్‌ బ్యాలెన్స్‌ను మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తోంది. రష్యాతో 50 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం ఉంది. చమురు దిగుమతుల ద్వారా భారత్‌కు లాభం జరుగుతోంది. ఈ ప్రయోజనాలను కొనసాగిస్తూ ట్రేడ్‌ను మరింత విస్తరించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

అమెరికా ఆందోళన..
బ్రిక్స్‌లో ప్రస్తుతం 11 సభ్య దేశాలు ఉన్నాయి. చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, భారత్‌ ఐదో స్థానంలో ఉంది. రష్యా సైనిక, ఇంధన శక్తిగా, దక్షిణాఫ్రికా సహా ఇతర దేశాలు కూడా హాజరవుతాయి. డాలర్‌ ఆధిపత్యానికి సవాల్‌గా ఈ వేదికను అమెరికా నిశితంగా గమనిస్తోంది. అలాంటి కీలక సమావేశానికి షీ, పుతిన్‌లను ఏకకాలంలో రప్పించడం భారత్‌ దౌత్య పరంగా సాధించిన పెద్ద విజయం. బంగ్లాదేశ్‌ను కూడా ఆహ్వానించినా, ప్రధాని తారీఖ్‌ రహ్మాన్‌ చిన్న కారణాలతో రాకపోవడం వారికే నష్టం. అన్ని ప్రధాన దేశాల అధినేతలను కలిసే అవకాశం, బ్రిక్స్‌కు మరింత చేరువయ్యే అవకాశం కోల్పోతున్నారు.

ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు..
ఈ దౌత్య విజయాన్ని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ సెప్టెంబర్‌ 5 నుంచి ఇండియా గేట్‌ వద్ద ర్యాలీ తలపెట్టింది. లాఠీచార్జి, హింసాత్మక దృశ్యాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని బ్రిక్స్‌ నుంచి మళ్లించి, భారత్‌ను పెట్టుబడులకు అననుకూలంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అయినా బ్రిక్స్‌ సమావేశం భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా మరింత పెంచే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, జిన్‌పింగ్, పుతిన్‌ల రాక కేవలం సమావేశం కాదు. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించడం, వాణిజ్య అసమతుల్యత సరిదిద్దడం, దౌత్యంలో భారత్‌ పాత్రను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలకు ఇది మార్గం. 2025 నుంచి మారుతున్న పరిస్థితుల్లో భారత్‌–చైనా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper