IQOO 11 5G: భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో IQOO కంపెనీకి తిరుగులేని స్థాయి ఉంది. ఈ కంపెనీ ప్రీమియం తో పాటు బడ్జెట్ ఫోన్లను కూడా తయారు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కంపెనీ తాజాగా కస్టమర్లకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో స్పీడ్ చార్జింగ్.. పవర్ ఫుల్ ప్రాసెసర్.. హై రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే వంటి ఫీచర్లను కోరుకునే వారికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చింది.
IQOO కంపెనీ తయారు చేసే ఫ్లాగ్ షిప్ ఫోన్లలో IQOO 11 5G కూడా ఒకటిగా ఉంది.. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు 8 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 59,999 గా ఉండేది. 16 జీబీ+ 256 జీబీ ధర 64,999 గా ఉండేది. అయితే ఈ మోడల్ ధరలు ఇప్పుడు తగ్గాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం IQOO 11 సిరీస్ లో 8 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర 39,999 ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకారం ఒకప్పుడు 60 వేలకు మించిన ధరలో ఉన్న ఫోన్ ఇప్పుడు సగం తగ్గింది.
Snap dragon 8 Gen 2 processor
IQOO 11 5G వేరియంట్ ఫోన్ లో అత్యంత ముఖ్యమైన అంశం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో పాటు LPDDR5X RAM, UFS 4.0 storage టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఫలితంగా యాప్స్ ఓపెన్ చేయడం.. మల్టీ టాస్కింగ్.. వీడియో ఎడిటింగ్.. హాయ్ అండ్ గేమింగ్.. వంటి పనులు సులభంగా చేయవచ్చు.. గేమింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఇందులో V2 చిప్ ను ఏర్పాటు చేశారు. కంపెనీ చెబుతున్న విరాలు ప్రకారం ఈ చిప్ గేమింగ్ ఫ్రేమ్ ఇంటర్ పోలేషన్, ఇమేజింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
144 Hz AMOLED డిస్ ప్లే
IQOO 11 5G లో 6.78 అంగుళాల 2K E6 AMOLED display ఉంటుంది. దీని రిజల్యూషన్ 3200*1440 పిక్సెల్స్ ఉంటుంది. రీ ఫ్రెష్ రేట్ 144 Hz గా ఉంటుంది…
హై రీ ఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ …యానిమేషన్.. గేమింగ్ వంటి సందర్భాల్లో డిస్ ప్లే అత్యంత సున్నితంగా కనిపించే అవకాశం ఉంది.
2K రిజల్యూషన్ కారణంగా వీడియోలు.. ఫోటోలు.. గేమింగ్ గ్రాఫిక్స్ లో మంచి డీటెయిల్ గా కనిపిస్తాయి. అందువల్లే ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ మాదిరిగా కాకుండా గేమింగ్, మల్టీమీడియా వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని..IQOO 11 5G ను ఫ్లాగ్ షిప్ ఫోన్ గా తీసుకొచ్చింది.
ఇందులో 5000 mAh battery ఉంది..120 W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ లభిస్తుంది. కేవలం 25 నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్ జాబ్ చేసుకోవచ్చు.
ఇందులో ట్రిపుల్ కెమెరా ఉంది. ప్రధాన కెమెరా 50 మెగా ఫిక్సెల్, దీనికి ఆల్ట్రాబైడ్ టెలిఫోటో/ పోర్ట్రైట్ కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరాలో కూడా V2 చిప్ ఉంటుంది.
గేమింగ్ కోసం ఇందులో పెద్ద vapor liquid cooling system ఉంది. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం మొత్తం కూలింగ్ ఏరియా 24.768 చదరపు మిల్లీమీటర్లుగా ఉంది. ఈ సమయంలో గివింగ్ లేదా ఇతర ప్రాసెసింగ్ సమయంలో ఫోన్లో ఉత్పత్తి అయ్యే వేడిని నియంత్రించవచ్చు. ఇందులో అదనంగా ఇన్ డిస్ప్లే డ్యూయల్ మాన్స్టర్ టచ్, డ్యూయల్ ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటివి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ మోడల్ రెండు ఆల్ఫా, లెజెండ్ అనే ప్రధాన రంగుల్లో ఉంది.
IQOO 11 పాత మోడల్ అయినప్పటికీ.. ఇందులో ఉన్న స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2.2 కే 144 Hz AMOLED display, 120 W 5000mAh బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే ఈ ఫోన్లను కొనుగోలు చేసే ముందు కస్టమర్లు ప్రస్తుతం మార్కెట్లో కొత్త మోడల్స్ కూడా పరిశీలించాలి. IQ 00 కంపెనీ నియో, జెడ్ సిరీస్ ఫోన్లను కూడా విక్రయిస్తోంది