Homeటాప్ స్టోరీస్Danam Nagender: హైకోర్టు అనర్హత వేటు వేసింది.. దానం ముందున్న మార్గాలు ఏంటి..

Danam Nagender: హైకోర్టు అనర్హత వేటు వేసింది.. దానం ముందున్న మార్గాలు ఏంటి..

Danam Nagender:  ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయంలో.. హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శాసనసభ సభ్యత్వానికి ఆయన అనర్హుడు అంటూ ప్రకటించింది. దీంతో గులాబీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. తాము హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే.. దానం నాగేందర్ అనర్హత వేటు ఎదుర్కొన్నారని.. స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టి వేసినప్పటికీ.. హైకోర్టు గౌరవప్రదంగా నడుచుకుందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. దానం నాగేందర్ ఇక్కడితో ఆగిపోతారా.. తదుపరి ఏం చేస్తారు.. ఆయన ముందు ఉన్న మార్గాలు ఏంటి.. […]

Danam Nagender:  ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయంలో.. హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శాసనసభ సభ్యత్వానికి ఆయన అనర్హుడు అంటూ ప్రకటించింది. దీంతో గులాబీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. తాము హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే.. దానం నాగేందర్ అనర్హత వేటు ఎదుర్కొన్నారని.. స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టి వేసినప్పటికీ.. హైకోర్టు గౌరవప్రదంగా నడుచుకుందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.

దానం నాగేందర్ ఇక్కడితో ఆగిపోతారా.. తదుపరి ఏం చేస్తారు.. ఆయన ముందు ఉన్న మార్గాలు ఏంటి.. ఇప్పుడు ఇదే చర్చ పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది.. నవంబర్ 18న హైకోర్టు ఆయనను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అంతేకాదు, తెలంగాణ శాసనసభ స్పీకర్ గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ టికెట్ మీద గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత పెట్టు వేయాలని గులాబీ పార్టీ నాయకులు హైకోర్టును ఆచరించారు. స్పీకర్ దానని తీరస్కరించారు. ఈ నిర్ణయాన్ని గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. అయితే వారి పిటిషన్లను హైకోర్టు అనుమతించి.. దానం సభ్యత్వాన్ని రద్దు చేసింది.

దానం ముందున్న మార్గాలు ఏంటి

చట్టపరంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో దానం నాగేందర్ సవాల్ చేసే అవకాశం ఉంది. అయితే దానం నాగేందర్ మాత్రం తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు అని ప్రకటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలు తాను రెడీగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం చూసుకుంటే ఆయన వైఖరి కోర్టులో కంటే ప్రజల్లో మళ్ళీ గెలవడం అనే తీరుగా ఉంది. ఆయన ప్రకటించిన రాజకీయ నిర్ణయం ప్రకారం చేసుకుంటే భవిష్యత్తులో మార్పు ఉంటే అవకాశం ఉంది.

హైకోర్టు తీర్పు ద్వారా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. ఈ ప్రకారం తదుపరి దశలో ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు దానం నాగేందర్ మాత్రం తాను ఎప్పుడు ఉపయోగించిన సిద్ధం అంటూ ప్రకటించారు.. ఉప ఎన్నికను.. ఇతర విషయాలను పక్కన పెడితే ఒక వ్యక్తి ఒక పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచిన తర్వాత.. మరో పార్టీలో చేరిన తర్వాత.. కొత్త అభ్యర్థిగా మరో ఎన్నికల్లో పోటీ చేస్తే.. అప్పుడు అతను మొదటి పార్టీ సభ్యుడు గానే కొనసాగుతాడా.. లేదా ఫిరాయింపు జరిగిందా.. అనే ప్రశ్నలు వ్యక్తమవుతాయి. దానం నాగేందర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హైకోర్టు తీర్పు ప్రకారం గడిచిన ఏడాది ఏప్రిల్ 23 నుంచి అనర్హత వర్తిస్తుందని తెలుస్తోంది.. ఈ ప్రకారం కేవలం ఈరోజు నుంచి ఎమ్మెల్యే పదవిపోయిందని విషయం కాదు.. కోర్టు నిర్ణయం వల్ల అనర్హత గత ఏడాది నుంచే అమల్లోకి వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper