Homeట్రెండింగ్ న్యూస్B R Naidu : TV5ని కాదని సుమన్ టీవీకి.. బి ఆర్ నాయుడు కొడుకు...

B R Naidu : TV5ని కాదని సుమన్ టీవీకి.. బి ఆర్ నాయుడు కొడుకు సంచలనం..

B R Naidu : చేతిలో బలమైన మీడియా.. అంతకుమించి తండ్రి టిటిడి చైర్మన్.. ఇంకా చెప్పాలంటే అర్థబలం.. అంగ బలం.. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బి ఆర్ నాయుడు కుమారుడు తన సొంత టీవీ ఛానల్ టీవీ5 ని కాకుండా.. వేరే దారి ఎంచుకున్నారు. అది కాస్త ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది. బిఆర్ నాయుడు కుమారుడిగా రవీంద్రనాథ్ చాలామందికి పరిచయం. కాకపోతే ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గతంలో గులాబీ పార్టీ.. […]

B R Naidu : చేతిలో బలమైన మీడియా.. అంతకుమించి తండ్రి టిటిడి చైర్మన్.. ఇంకా చెప్పాలంటే అర్థబలం.. అంగ బలం.. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బి ఆర్ నాయుడు కుమారుడు తన సొంత టీవీ ఛానల్ టీవీ5 ని కాకుండా.. వేరే దారి ఎంచుకున్నారు. అది కాస్త ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది.

బిఆర్ నాయుడు కుమారుడిగా రవీంద్రనాథ్ చాలామందికి పరిచయం. కాకపోతే ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గతంలో గులాబీ పార్టీ.. వైసిపి పార్టీ అతని మీద ఏవేవో ఆరోపణలు చేశాయి. మాదకద్రవ్యాల కేసు అతని మీద ఉందని విమర్శించాయి. ఆ విమర్శలు ఆరోపణలు గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిజం చేశాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా రవీంద్రనాథ్ పేరు తెరమీదకి వచ్చింది.

రవీంద్రనాథ్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కి బాధ్యులుగా కొనసాగుతున్నారు. ఇది హైదరాబాద్ నగరంలో వందలాది ఎకరాలలో విస్తరించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వివిఐపీలు.. హై ప్రొఫైల్ వ్యక్తులు ఈ సొసైటీలో భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో రెండు ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్వ అధ్యక్షుడిగా మరొకసారి సొసైటీలో సత్తా చాటాలని రవీంద్రనాథ్ భావిస్తున్నారు. రవీంద్రనాథ్ కు వ్యతిరేకంగా ప్రముఖ బిల్డర్ బొల్లినేని శీనయ్య ఉన్నారు.

వాస్తవానికి రవీంద్రనాథ్ తన సొంత టీవీ 5 ఛానల్ లోనే ప్రచారం చేసుకోవచ్చు. అవసరమైతే గంటలకు గంటలు తాను అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ సొసైటీకి చేసిన మంచి పనుల గురించి వివరించుకోవచ్చు. కానీ అవేవి చేయకుండా. సొంత ఛానల్ లో ప్రచారం చేసుకోకుండా సుమన్ టీవీలోకి వచ్చేశారు రవీంద్రనాథ్. సుమన్ టీవీ సీనియర్ యాంకర్ రోహన్ తో దాదాపు గంటకు పైగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ఆపోజిట్ కాండేట్ శీనయ్య మీద రవీంద్రనాథ్ ఆరోపణలు చేశారు. ఇంకా అనేక అంశాలను కూడా వివరించారు. హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద సొసైటీగా.. వందల ఎకరాలలో విస్తరించి.. వి విఐపి లకు సభ్యత్వం ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ తన సొంత టీవీ ఛానల్ కాకుండా.. సుమన్ టీవీ ని ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ లెక్కన టీవీ5 ఛానల్ ను రవీంద్రనాథ్ తక్కువ చేసినట్టా.. లేదా సుమన్ టీవీ ద్వారా చెప్తేనే జనాల్లోకి వెళ్తుందని అనుకున్నట్టా.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏమో గాని.. రవీంద్రనాథ్ వ్యతిరేక వర్గీయులు మాత్రం సుమన్ టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper