Homeజాతీయ వార్తలుIndian Army: చైనా మార్షల్ ఆర్ట్స్ సవాల్.. సరిహద్దుల్లో భారత సైనికులు ఇచ్చిన కౌంటర్ వైరల్.....

Indian Army: చైనా మార్షల్ ఆర్ట్స్ సవాల్.. సరిహద్దుల్లో భారత సైనికులు ఇచ్చిన కౌంటర్ వైరల్.. వీడియో

Indian Army: చైనా సైనికులు ఇటీవల మార్షల్ ఆర్ట్స్ చేశారు. అది కూడా మంచు దట్టంగా కురిసే ప్రాంతంలో.. సహజంగా మంచు ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టుకుపోయే వాతావరణం ఉంటుంది. మందమైన దుస్తులు ధరిస్తే తప్ప శరీరంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. అలాంటి చోట కేవలం కింది ప్రాంతాల్లో మాత్రమే ఒక షార్ట్ లాంటిది వేసుకొని.. దేహం మొత్తం కనిపించే విధంగా ఇటీవల చైనా […]

Indian Army: చైనా సైనికులు ఇటీవల మార్షల్ ఆర్ట్స్ చేశారు. అది కూడా మంచు దట్టంగా కురిసే ప్రాంతంలో.. సహజంగా మంచు ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టుకుపోయే వాతావరణం ఉంటుంది. మందమైన దుస్తులు ధరిస్తే తప్ప శరీరంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. అలాంటి చోట కేవలం కింది ప్రాంతాల్లో మాత్రమే ఒక షార్ట్ లాంటిది వేసుకొని.. దేహం మొత్తం కనిపించే విధంగా ఇటీవల చైనా సైనికులు మార్షల్ ఆర్ట్స్ చేశారు. ఒకరకంగా ఇండియాకు తిరుగులేని షాక్ ఇచ్చారు.

చైనా సైనికులు చేసిన మార్షల్ ఆర్ట్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చైనా సైనికుల సామర్థ్యం ముందు భారత సైనికులు అంతగా నిలబడలేరని.. వాళ్ల వల్ల కాదని అందరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో చైనాకు సరైన స్థాయిలో సమాధానం చెప్పాలని భారత సైనికులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే చైనాకు దీటుగా రిప్లై ఇచ్చారు. దీంతో మన సైనికుల సామర్థ్యం ముందు చైనా సైనికుల శక్తి చిన్నదని ప్రపంచం నమ్మింది. అంతేకాదు భారత సైనికుల శక్తిని కొనియాడుతోంది.

భారత సైనికులు టిబెట్ సరిహద్దుల్లో ఉన్న 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న మంచు కొండల మధ్య చొక్కాలు లేకుండా యోగా చేశారు. గంటల తరబడి మంచు కురుస్తుంటే.. చొక్కాలు లేకుండా అలానే కూర్చున్నారు. రకరకాల యోగాసనాలు వేశారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. చలి అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో రక్తం గడ్డకట్టుకుపోయే మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉంటాయి. అందువల్లే ఇక్కడ సైనికులు ఎక్కువసేపు ఉండలేరు. ఈ ప్రాంతంలో పహారా కాసే సైనికులు కొద్ది గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తూ ఉంటారు.

ఇక్కడ పనిచేసే సైనికులకు ప్రత్యేక వసతులు ఉంటాయి. ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. వైద్యులు ఎప్పటికీ సైనికులను పర్యవేక్షిస్తూ ఉంటారు. అటువంటి చోట మన సైనికులు గంటల తరబడి యోగా చేశారు అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్రతికూల వాతావరణం లో గంటల తరబడి ఈ స్థాయిలో శరీరాన్ని నిగ్రహించుకున్నారంటే చైనాకు స్లిప్పర్ షాట్ లాంటి సమాధానం చెప్పినట్టే. చైనా మార్షల్ ఆర్ట్స్ తో మనల్ని రెచ్చగొడితే.. మనకు మాత్రమే సాధ్యమైన యోగాతో మన సైనికులు డ్రాగన్ దేశానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇది ఇండియా అంటే.. ఇది ఇండియన్ సైనికుల సామర్థ్యం అంటే.. పాపం చైనా.. మన దగ్గర నుంచి ఇది ఊహించలేదు. చివరికి బొక్కా బోర్లా పడింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper