Chinese Education System : బాల్యం అనేది అమూల్యమైనది. చిన్న వయసులో ఆడే ఆటలు.. పాడే పాటలు.. మాట్లాడే మాటలు.. చేసే పనులు ఇవన్నీ కూడా ముద్దు ముద్దుగా ఉంటాయి. చిన్నపిల్లలు అబద్దాలు ఆడరు. మోసాలు చేయరు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టరు. అందువల్లే వాళ్లను దేవుళ్ళతో సమానం అని చెబుతుంటారు.
బాల్యం అనేది చాలా గొప్పది. బాల్యాన్ని ఎంతగా ఆస్వాదిస్తే వారి జీవితం అంత గొప్పగా ఉంటుంది.. బాల్యాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి. అలాకాకుండా ఒత్తిడి పెడితే పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. వారిలో మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసినప్పటికీ చైనాలో విరుద్ధంగా జరుగుతోంది. చైనాలో ఫ్రీ మేడ్ చిల్డ్రన్ అనే కొత్త పదం విపరీతమైన వాడుకలో ఉంది. దీని ప్రకారం సెలవుల్లోనూ పిల్లలను ఆడుకొని ఇవ్వకుండా వచ్చే ఏడాది సిలబస్ ను ముందే చదివించే తల్లిదండ్రుల వ్యవహార శైలిని ఇది ఎత్తిచూపుతోంది… ఫ్రీ మేడ్ మీల్స్ మాదిరిగా.. పిల్లలను చదువుకు ముందే సిద్ధం చేస్తున్నారు. అందువల్లే ఈ పదం పెట్టారు. ఈ కఠినమైన విధానం పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుంది.. పిల్లలు స్వేచ్ఛగా ఆడే అవకాశం లేకుండా పోతోంది.
చైనాలో విద్యా విధానం కూడా స్వేచ్ఛగా ఉండదు. పిల్లలకు చదువుతోపాటు ఆటలు నేర్పుతూ ఉంటారు. ఆటల్లో ప్రావీణ్యం సాధించిన వారికి కఠినమైన విధానాలలో శిక్షణ ఇస్తూ ఉంటారు. అందువల్లే అంతర్జాతీయ పోటీలలో చైనా క్రీడాకారులు ఎక్కువగా మెడల్స్ సాధిస్తారు. ఇది చెప్పుకోడానికి గొప్పగానే ఉన్నప్పటికీ దాని వెనుక చైనా పిల్లలు పడుతున్న ఇబ్బందులు మామూలుగా ఉండదు. ఖ్యాతి కోసం చైనా దేశం ఎంతకైనా తెగిస్తుంది. ఎక్కడ దాకా అయినా వెళ్తుంది. అందులో ఏమాత్రం రాజీ పడదు. చివరికి చిన్న పిల్లల విషయంలో కూడా చైనా తన ధోరణి మార్చుకోవడం లేదు.
మనదేశంలో అయితే పిల్లలకు ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి చదువు ఉండదు. ఆ వయసులో పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తుంటారు. అక్కడ వారికి పోషకాహారం అందుతూ ఉంటుంది. చిన్న చిన్న కృత్యాలు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకు చదువు మీద అవగాహన కలిగే విధంగా చేస్తుంటారు. అయితే ఈ విధానం మొత్తం స్వేచ్ఛాయుతంగా సాగుతూ ఉంటుంది. బలవంతం ఉండదు. పిల్లల మీద ఒత్తిడి అసలు ఉండదు. అందువల్లే మన దేశంలో పిల్లలు సమర్థవంతంగా ఉంటారు.. చైనా చేస్తున్న ఈ విధానం పట్ల మానసిక విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా పాలకులు మారాలని.. అక్కడి తల్లిదండ్రులు తమ ధోరణి మార్చుకోవాలని సూచిస్తున్నారు.