Megastar Chiranjeevi: జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఫాలో అవుతున్నారు?

చిరంజీవి సినిమా అంటే మెగాస్టార్ అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న చిరు బింబిసారా దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  • Written By: Suresh
  • Published On:
Megastar Chiranjeevi: జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఫాలో అవుతున్నారు?

Follow us on

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఈయన కిస్మత్ బాగా లేనట్టుగా ఉంది. అందుకే రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఫ్లాప్ లను సొంతం చేసుకున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా మినహాయిస్తే చిరు నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సైరా రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వాల్తేరు వీరయ్య మాత్రమే అభిమానులను ఆకట్టుకుంది. దీంతో చిరు తన రూట్ మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకోసం ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను ఫాలో అవుతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.

చిరంజీవి సినిమా అంటే మెగాస్టార్ అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న చిరు బింబిసారా దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే మెగాస్టార్ నటించిన జగదీకవీరుడు అతిలోక సుందరి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇదొక సోషియా ఫాంటసీ సినిమా. ఈ సినిమా తర్వాత మళ్లీ అలాంటి సినిమాలో నటించబోతున్నారు చిరు. దీనికి ముల్లోక వీరుడు అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారట. అయితే చిరు కెరీర్ లో 156వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. కానీ ప్రస్తుతం చిరంజీవి మార్కెట్ ను నమ్ముకొని ఈ రేంజ్ లో బడ్జెట్ అంటే రిస్కే అంటున్నారు కొందరు.

ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టాలంటే వశిష్ట ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనే నమ్మకమే ఎక్కువగా ఉందట అభిమానుల్లో.. కథ కూడా బాగా వచ్చిందని టాక్. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని టాక్. యంగ్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారట ఈ స్టార్. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పుష్ప 1 హిట్ తో రెండో భాగం తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కూడా బాహుబలి రెండు పార్టులతో వచ్చి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా రానుంది. అందుకే ఇప్పుడు చిరు కూడా యంగ్ హీరోలను ఫాలో అవుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టడం వెనుక రెండు భాగాలు ఉన్నాయని టాక్. మరి ఈ సినిమా చిరంజీవి కి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు